షారుఖ్ ఫ్యామిలీలో ఉహించని మార్పులు.. Aryan Khan జైలు నుంచి తిరిగొచ్చాక జరిగేది ఇదే..!

ABN , First Publish Date - 2021-10-31T00:41:32+05:30 IST

ఆర్యన్ ఖాన్ జైలు కథ ఇప్పటికైతే ముగిసింది. వాట్ నెక్ట్స్? డ్రగ్స్ కేసులో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో మనం చెప్పలేం. కానీ, ఆలోపు ఆర్యన్ వ్యక్తిగత జీవితంలో, అతడి ఇంట్లో భారీ మార్పులే జరగబోతున్నాయి. 23 ఏళ్ల యంగ్ అండ్ హ్యాండ్సమ్ ఇక మీదట మరింత బుద్దిగా, బాధ్యతగా ఉండాల్సిందే!

షారుఖ్ ఫ్యామిలీలో ఉహించని మార్పులు.. Aryan Khan జైలు నుంచి తిరిగొచ్చాక జరిగేది ఇదే..!

ఆర్యన్ ఖాన్ జైలు కథ ఇప్పటికైతే ముగిసింది. వాట్ నెక్ట్స్? డ్రగ్స్ కేసులో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో మనం చెప్పలేం. కానీ, ఆలోపు ఆర్యన్ వ్యక్తిగత జీవితంలో, అతడి ఇంట్లో భారీ మార్పులే జరగబోతున్నాయి. 23 ఏళ్ల యంగ్ అండ్ హ్యాండ్సమ్ ఇక మీదట మరింత బుద్దిగా, బాధ్యతగా ఉండాల్సిందే!


షారుఖ్ తనయుడు అనేక రోజుల పాటూ జైల్లో గడిపి వచ్చాడు. ఆ సమయంలో అతడికి ఇంటి నుంచీ ఆహారం అందలేదు. మిగతా ఖైదీలు ఏం తిన్నారో అదే తినాల్సి వచ్చింది. దాంతో అతడి తల్లిదండ్రులు ప్రస్తుతం ఆర్యన్ ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళనగానే ఉన్నారట. ఇంటికి చేరిన ఆర్యన్‌కు కొన్నాళ్ల పాటూ ఎంతో జాగ్రత్తగా హెల్తీ డైట్‌ని ప్లాన్ చేయబోతున్నారని సమాచారం.


ఆహారం విషయంలో మాత్రమే కాదు, ఆర్యన్ కదలికల విషయంలోనూ... షారుఖ్, గౌరీ అనేక ముందస్తు చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్నాళ్ల పాటూ ఆర్యన్ ఎటు వెళ్లినా మీడియా ఫాలో అవుతూనే ఉంటుంది కాబట్టి అతను ‘మన్నత్’ నుంచీ కాలు బయటపెట్టే ఛాన్స్ లేదు. అలాగే, ప్రతీ శుక్రవారం మాత్రం ఎన్సీబీ ఆఫీసుకి తప్పకుండా వెళ్లాల్సి ఉంటుంది. బెయిల్ మంజూరు సమయంలో జడ్జ్ ఈ నియమాన్ని విధించారు. కాబట్టి వారానికి ఒకసారి తప్ప కొన్ని రోజుల పాటూ ఆర్యన్ ఖాన్ మీడియా కెమెరాలకు చిక్కక పోవచ్చు... 


హఠాత్తుగా జైలు జీవితం గడాపాల్సిన వచ్చిన ఆర్యన్ ఖాన్ శారీరికంగా, మానసికంగా ఎంతో ఒత్తిడికి గురయ్యాడు. అందుకే, తల్లి గౌరీ ఖాన్ ప్రత్యేకంగా డాక్టర్స్‌ని ఇంటికి పిలిపించుకుని వైద్య పరీక్షలు నిర్వహింపజేస్తారని సమాచారం. వారి సలహాలు, సూచనలకు అనుగుణంగా ఆర్యన్ ఖాన్ రొటీన్ ఉండబోతోంది. మానసికంగానూ, గత కొన్ని రోజుల పాటూ సాగిన పీడకలని ఆర్యన్ మరిచిపోయేలా, కౌన్సిలింగ్ ఇప్పిస్తారంటూ బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. తన వారసుడు డిప్రెషన్‌కి లోనుకాకుండా షారుఖ్ ఖాన్ పలు జాగ్రత్తలు తీసుకుంటాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.


ఇక ఇప్పటికిప్పుడే కాకున్నా... రానున్న కొన్ని నెలల్లో... ఆర్యన్ బాలీవుడ్ ఎంట్రీ కూడా జరగనుంది. అతను ఇప్పటికే విదేశాల్లో యాక్టింగ్, ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ పొంది వచ్చాడు. డ్రగ్స్ కేసు వల్ల నెగటివ్ పబ్లిసిటీ వచ్చినప్పటికీ ఆర్యన్ పేరైతే దేశం మొత్తం మార్మోగింది. కాబట్టి కింగ్ ఖాన్ తనయుడితో సినిమాకు సహజంగానే నిర్మాతలు క్యూ కడతారు. కాస్త ఈ అరెస్ట్, బెయిల్ వ్యవహారాల వల్ల వచ్చిన షాక్ నుంచీ తేరుకున్నాక బాద్షా కొడుకు రంగ ప్రవేశంపై దృష్టి పెట్టవచ్చు. అదే జరిగితే, ఆర్యన్‌ను హిందీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో... చూడాలి మరి! 

Updated Date - 2021-10-31T00:41:32+05:30 IST