Prabhas Pain: ఏమైంది.. ఎందుకలా?

Twitter IconWatsapp IconFacebook Icon
Prabhas Pain: ఏమైంది.. ఎందుకలా?

ప్రభాస్‌కి ఏమైంది..(Prabhas) 

నడిచేటప్పుడు ఎందుకు పట్టిపట్టి నడుస్తున్నారు.. 

చెప్పులు వేసుకోవడానికి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు?

ప్రస్తుతం నెట్టింట జరుగుతున్న చర్చ ఇది..

అభిమానులు ఓ పక్క ‘ఆదిపురుష్‌’ (Adipurush)టీజర్‌ విడుదలైందనే ఆనందంతోపాటు అభిమాన హీరో నడిచేటప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’ టీజర్‌ను అయోధ్యలో విడుదల చేశారు. దీని కోసం ప్రభాస్‌ ఆదివారం అయోధ్య (Ayodhya ram ramdir) చేరుకొని అక్కడి రామాయణ హోటల్‌లో బస చేశారు. అనంతరం శ్రీరాముణ్ణి దర్శించుకుని, సాయంత్రం టీజర్‌ రిలీజ్‌ (Teaser launch)కోసం వేదికకు చేరుకున్నారు. అక్కడ ఆయన నడవడానికి ఇబ్బంది పడుతున్నట్లు వీడియో ఫుటేజ్‌ వల్ల తెలిసింది. మెట్టు ఎక్కడానికి కూడా పక్కన ఉన్నవారి సాయం అందుకున్నారు. కనీసం చెప్పులు కూడా వేసుకోలేకపోయారు. పక్కనే ఉన్న హీరోయిన్‌ కృతీసనన్‌, డైరెక్టర్‌ ఓం రౌత్‌ చేతులు సపోర్ట్‌తో చెప్పులు వేసుకున్నారు. మెట్టు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కూడా ఆయన ఇబ్బంది పడుతున్న విషయం తెలుస్తుంది. 


కొన్ని నెలల క్రితం ప్రభాస్‌ మోకాలికి ఆపరేషన్‌ జరిగిందే వార్తలొచ్చాయి. అయితే అది వాస్తవమా కాదా అన్నది తెలియదు. వరుస సినిమాలతో రెస్ట్‌ లేకుండా పని చేయడం వల్ల ఆయన కాలి నొప్పితో బాధపడుతున్నట్లు అయోధ్య ఈవెంట్‌ వీడియోలు చూస్తుంటే తెలుస్తోంది. నెటిజన్లు, అభిమానులు అయితే ‘బాహుబలి’ సమయంలో తగిలిన గాయాల వల్లే ఈ సమస్య అన్నట్లు గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ ‘ఆది పురుష్‌’, సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. 


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.