శ్రియ భర్తకి ఏమైంది?

ABN , First Publish Date - 2022-03-04T00:02:01+05:30 IST

నటి శ్రియ భర్తకి ఏమైంది. చేతికి ఆ బ్యాండేజీలు ఏంటి? ప్రస్తుతం శ్రియ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. శ్రియా శరణ్ పరిచయం అక్కరలేని పేరు. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా దూసుకుపోయిన శ్రియ..

శ్రియ భర్తకి ఏమైంది?

నటి శ్రియ భర్తకి ఏమైంది. చేతికి ఆ బ్యాండేజీలు ఏంటి? ప్రస్తుతం శ్రియ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. శ్రియా శరణ్ పరిచయం అక్కరలేని పేరు. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా దూసుకుపోయిన శ్రియ.. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ఫారినర్ ఆండ్రీ కొశ్చివ్‌ను పెళ్లి చేసుకుని.. కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఇదే సమయంలో ఓ పాపకి తల్లి కూడా అయింది. అయితే ఈ విషయం ఎవరికీ శ్రియ చెప్పలేదు. రీసెంట్‌గానే తనకొక పాప పుట్టినట్లుగా ఆమె రివీల్ చేసింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం శ్రియ యమా యాక్టివ్‌గా ఉంటూ.. ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. భర్తతో కలిసి హాట్ హాట్‌గా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా ఉండేది. మళ్లీ ఇప్పుడు తన వద్దకు వచ్చిన పాత్రల్లో నటిస్తూ.. బిజీబిజీగా గడుపుతోంది. మరి ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్‌లో శ్రియ భర్త బ్యాండేజీలతో కనిపిస్తున్నారు. ఈ పిక్స్ చూసిన వారంతా ఆమె భర్తకి ఏమై ఉంటుందో అని అనుకుంటున్నారు. దీనిపై శ్రియానే వివరణ ఇచ్చింది.


తన భర్త సర్జరీకి సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన శ్రియ.. ‘‘హెర్నియాతో బాధపడుతున్న నా భర్తకు సర్జరీ చేసి మంచి చికిత్స అందించిన అపోలో హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. సుమారు రెండు నెలల నుండి తను ఇబ్బంది పడుతున్నాడు. కనీసం పాప రాధను కూడా ఎత్తుకోలేని పరిస్థితిని అనుభవించారు. అయితే ఇప్పుడా ఇబ్బంది లేదు. తను కోలుకున్నారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ డాక్టర్ రజనీస్ రెడ్డిగారికి కృతజ్ఞతలు. అలాగే మాకు సహాయం అందించిన ఉపాసన కొణిదెలకు ధన్యవాదాలు..’’ అని తెలిపారు. దీనికి ఉపాసన కూడా ‘అంతా చక్కగా జరిగినందుకు సంతోషంగా ఉంది’ అని రిప్లయ్ ఇచ్చారు. 



Updated Date - 2022-03-04T00:02:01+05:30 IST