Tollywood : శర్వానంద్, నాగశౌర్య సినిమాల మాటేంటి?

ABN , First Publish Date - 2022-08-04T21:39:55+05:30 IST

టాలీవుడ్‌లో ఆ ఇద్దరు యంగ్ హీరోలూ టాలెంటెడే. వైవిధ్యమైన కథలతో సినిమాలు చేయాలని తపించి, శ్రమించే తత్వం. ఇద్దరి ఖాతాలోనూ చెప్పుకోదగ్గ హిట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి హీరోల జాతకాలే బాగోలేదు. ఎప్పటికప్పుడు సరికొత్త కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ ఇద్దరికీ కొన్నాళ్ళుగా అదృష్ట దేవత ముఖం చాటేస్తోంది.

Tollywood : శర్వానంద్, నాగశౌర్య సినిమాల మాటేంటి?

టాలీవుడ్‌లో ఆ ఇద్దరు యంగ్ హీరోలూ టాలెంటెడే. వైవిధ్యమైన కథలతో సినిమాలు చేయాలని తపించి, శ్రమించే తత్వం. ఇద్దరి ఖాతాలోనూ చెప్పుకోదగ్గ హిట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి హీరోల జాతకాలే బాగోలేదు. ఎప్పటికప్పుడు సరికొత్త కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ ఇద్దరికీ కొన్నాళ్ళుగా అదృష్ట దేవత ముఖం చాటేస్తోంది. ఆ ఇద్దరూ శర్వానంద్ (Sharvanand), నాగశౌర్య (Nagasourya). ఈ ఇద్దరి తాజా చిత్రాలు టాకీ పార్ట్ పూర్తి చేసుకొని విడుదల ముంగిట ఆగాయి. శర్వానంద్ సరైన సక్సెస్ అందుకొని చాలా కాలమైంది. ఆఖరుగా అతడు తెరపై కనిపించిన సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ (Aadavallu meeku Joharlu). 


ఈ సినిమాకన్నా ముందు ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham) చిత్రాన్ని విడుదల చేద్దామనుకొని, ఎందుకో సడెన్ గా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాన్నే విడుదల చేశాడు. ఆ సినిమా శర్వాను తీవ్రంగా నిరాశపరిచింది. అంతకు ముందు‘శ్రీకారం’ (Sreekaram) సినిమా బాగుందని టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్‌గా నిలబడలేకపోయింది. ఆ తర్వాత ‘మహాసముద్రం’ (Mahasamudram) చిత్రం కూడా ఘోరపరాజయం పాలైంది. దాంతో ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంపై ఆశలు పెట్టుకున్న శర్వాకు  అది కూడా ఫ్లాపవ్వడంతో సైలెంట్ అయిపోయాడు. ఇక శర్వాకు మిగిలిన ఒకే ఒక ఆశ ‘ఒకే ఒక జీవితం’ సినిమా. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమాకు రిలీజ్ డేట్ ప్రకటించకుండా శర్వా ఇంకా లేట్ చేస్తున్నాడు. 


రెండేళ్ళ క్రితం ‘అశ్వథ్థామ’ (Ashwathama) తో మంచి హిట్ కొట్టిన నాగశౌర్య.. ఆ తర్వాత నటించిన ‘వరుడు కావలెను’ (Varudu kavalenu) మంచి టాక్ తెచ్చుకుంది. అయితే నిర్మాతలకు వసూళ్ళు మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది. దాంతో తదుపరి చిత్రం ‘లక్ష్య’ (Lakshya) తో అయినా మంచి విజయం సాధించాలనుకున్నాడు. ఆర్చరీ ఛాంపియన్ పాత్ర కోసం కష్టతరమైన కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ బాడీని కూడా బిల్డ్ చేశాడు. కట్ చేస్తే కథనంలో సత్తా లేక బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది సినిమా. ఇక ఇప్పుడు ‘కృష్ణ వ్రింద విహారి’ (Krishna Vrinda Vihari) చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే మే నెల్లోనే విడుదల చేస్తున్నట్టు ప్రకటించి ఇప్పటికి పలుమార్లు వాయిదా వేశారు. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయాలనే విషయంలో నిర్మాతలకు ఇంకా క్లారిటీ రాలేదు. అలా శర్వా, శౌర్య చిత్రాలు రెండూ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ చేయకుండా ఆగిపోయాయి. మరి ఈ రెండు సినిమాలూ ఎప్పుడు విడుదలవుతాయో చూడాలి. 

Updated Date - 2022-08-04T21:39:55+05:30 IST