తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2022-11-09T13:54:07+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా నవంబర్ 8న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


క్లాస్ ఫ్యామిలీ 2  (The Claus Family 2)

క్లాస్ ఫ్యామిలీ 2 (డి ఫ్యామిలీ క్లాస్ 2) అనేది డచ్ క్రిస్మస్ నేపథ్య చిత్రానికి కొనసాగింపు. ఇది ఒక యువకుడు జూల్స్ (మో బక్కర్), అతని తాత అకా శాంటా క్లాజ్ నోయెల్ చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో వారసత్వాన్ని, విచ్ఛిన్నమైన సంబంధాలను పునరుద్ధరించేందుకు యువ శాంతా క్లాజ్ చేసే ప్రయత్నాలను చూపిస్తుంది. ఈ మూవీ ఒక గంట ముప్పై ఎనిమిది నిమిషాల రన్‌టైమ్‌ ఉంది. రూబెన్ వాండెన్‌బోర్రే దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.


బిహైండ్ ఎవ్రీ స్టార్ (Behind Every Star)

బిహైండ్ ఎవ్రీ స్టార్ అనేది దక్షిణ కొరియాలో కొనసాగుతున్న టెలివిజన్ ధారావాహిక. దీనికి బేక్ సెంగ్రి యోంగ్ దర్శకత్వం వహించాడు.లీ సియో-జిన్, క్వాక్ సన్-యంగ్, సియో హ్యూన్-యో, జూన్ కీలకపాత్రలో నటించారు. ఫ్రెంచ్ టీవీ సిరీస్ కాల్ మై ఏజెంట్! ఆధారంగా ఈ టీవీ సిరీస్‌ని తెరకెక్కించారు. ఈ వెబ్‌సిరీస్‌ ప్రస్తుతం సెలక్టివ్‌ ఏరియాల్లో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

Minions & More Volume 2 - ఇంగ్లిష్‌

Neal Brennan: Blocks - ఇంగ్లిష్‌

Triviaverse - ఇంగ్లిష్‌





Updated Date - 2022-11-09T13:54:07+05:30 IST