Happy birthday Kiara Advani: ఏడాది వయస్సులో కియారా ఎంత ముద్దుగా ఉందో చూశారా?.. వైరలవుతున్న వీడియో

ABN , First Publish Date - 2022-07-31T19:36:00+05:30 IST

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా చేసిన ‘ఎంఎస్ ధోని’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన నటి కియారా అడ్వాణీ...

Happy birthday Kiara Advani: ఏడాది వయస్సులో కియారా ఎంత ముద్దుగా ఉందో చూశారా?.. వైరలవుతున్న వీడియో

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా చేసిన ‘ఎంఎస్ ధోని (MS Dhoni)’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన నటి కియారా అడ్వాణీ (Kiara Advani). అనంతరం మహేశ్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న ఈ భామ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ రోజు (జులై 31) కియారా పుట్టినరోజు (Birthday). ఈ బ్యూటీ ఏడాది నిండక ముందే తల్లి జెనీవీవ్ జాఫ్రీతో కలిసి ఓ ప్రకటనలో నటించింది. ఈ తరుణంలో దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


తల్లితో కలిసి కియారా నటించిన ఈ యాడ్‌ని ఈ బ్యూటీనే 2016లో మదర్స్ డే సందర్భంగా ట్విట్టర్‌లో షేర్ చేసింది. బేబీ సోప్‌కి సంబంధించిన ప్రకటన అది. అందులో ఏడాది వయసు కూడా లేని కియారా చాలా క్యూట్‌గా, ముద్దులోలికేలా ఉంది. ఈ పోస్ట్‌కి.. ‘నాకు రత్నం దొరికింది! మా అమ్మతో నా మొట్టమొదటి ప్రకటన. లవ్ యూ అమ్మా. నేను నీవల్లే ఇక్కడ ఉన్నాను’ అంటూ ఎంతో ఎమోషనల్‌గా రాసుకొచ్చింది. ఈ వైరల్ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ ‘సూపర్’, ‘క్యూట్’, ‘లవ్లీ’ అంటూ వరుసగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


ఇటీవలే వరుణ్ ధావన్‌‌తో కలిసి చేసిన ‘జుగ్ జుగ్ జియో’ సినిమాతో, కార్తీక్ ఆర్యన్‌తో కలిసి నటించిన ‘భూల్ భూలయ్యా 2’తో కియారా వరుసగా రెండు సూపర్ హిట్లు కొట్టింది. కాగా.. ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో రామ్‌చరణ్‌, టాప్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్నపేరు పెట్టని సినిమాలో, విక్కీ కౌశల్‌తో కలిసి ‘గోవిందా నామ్ మేరా’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తూ కెరీర్‌లో బిజీగా ఉంది.



Updated Date - 2022-07-31T19:36:00+05:30 IST