Bigg Boss Non Stop: అసలాట ఇప్పుడు మొదలైంది

ABN , First Publish Date - 2022-05-11T06:03:01+05:30 IST

డీస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో నాన్ స్టాప్‌గా ప్రసారమవున్న బిగ్ బాస్‌ (Bigg Boss)లో.. అసలాట ఇప్పుడే మొదలైనట్లుగా అర్థమవుతుంది. రోజురోజుకి కంటెస్టెంట్స్ మధ్య వైరం పెరిగిపోతుంది. మరీ ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ (Nataraj Master), బిందుమాధవి

Bigg Boss Non Stop: అసలాట ఇప్పుడు మొదలైంది

డీస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో నాన్ స్టాప్‌గా ప్రసారమవున్న బిగ్ బాస్‌ (Bigg Boss)లో.. అసలాట ఇప్పుడే మొదలైనట్లుగా అర్థమవుతుంది. రోజురోజుకి కంటెస్టెంట్స్ మధ్య వైరం పెరిగిపోతుంది. మరీ ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ (Nataraj Master), బిందుమాధవి (Bindu Madhavi) ఉన్న తాజా బిగ్‌బాస్‌ ప్రోమోలో సమ్మర్‌లో కంటే ఎక్కువ హీట్ కనిపించింది. లోపల కష్టపడి గెలవటానికి అంతా సోల్జర్స్‌లా కష్టపడుతుంటే.. కానీ బయట బిందుమాధవి భజన బాగా ఎక్కువైందని లోపల వాళ్లకి బిగ్‌బాసే ఉప్పందించాడు. దీంతో కంటెస్టెంట్లకి తమ కష్టాల్ని బిందు టీం జస్ట్‌ కరెన్సీతో కవర్‌ చేసేసి ఆడపులి అని.. ఈసారి బిందు విన్నర్‌ అని ఫేక్ ఆర్మీతో తెగరాయించేసుకుంటుందనేలా వారు ప్రవర్తిస్తుండటం గమనించవచ్చు. ఇక ఇది స్ట్రాంగ్‌గా ఆడే స్ట్రాంగ్ గేమర్‌ నటరాజ్‌ మాస్టర్‌కి కూడా అర్థమైపోయినట్టుంది. అందుకే తేడాలొస్తే వెనకా ముందు ఆలోచించక స్ట్రయిట్‌గా మాట్లాడేసే నటరాజ్‌ మాస్టర్‌ ముందు బిందు తట్టుకోలేకపోయింది. 


ఎందుకంటే పాపం బిందుమాధవి కష్టపడి ఆడే టాస్క్‌లకి దూరం అని అందరితో అనిపించుకుంది. కానీ నటరాజ్‌ మాస్టర్‌ కిల్లర్‌ టాస్క్‌ దగ్గర నుంచి ప్రతి టాస్క్‌లలో ఈ ఆట గెలవకపోతే పరువు పోతుందన్నట్టు చెడుగుడు ఆడేసి అందరి మనసులు గెలుస్తున్నాడు. అతనితోపాటు శివ (Siva), అఖిల్‌ (Akhil), అరియానా (Ariyana), మిత్ర (Mithraaw) ఉండగా.. సుఖజీవిగా బిందుమాధవి కౌశల్ ఆర్మీ తరహాలో సుఖీభవ అనిపించుకుంటుంటే.. లోపల కంటే బయటే ఆవిడ చాలా స్ట్రాంగ్‌గా ఆడుతుందని అర్థమై కంటెస్టెంట్స్ అందరూ ఆమెపై కౌంటర్‌లు మొదలెట్టారు. అయినా సరే.. టాస్క్‌లు ఆడకపోయినా.. ప్రైజ్ మనీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందనే బ్రహ్మానందం (Brahmanandam) డైలాగ్‌లా.. నేనే గెలుస్తానని బిందుకి ముందే తెలిసినట్టు తాపీగా ఉంటుంది తప్ప కంగారుపడట్లేదు. బిందు సుఖీభవ.. ఇతర కంటెస్టెంట్‌లు కష్టే ఫలి.

Updated Date - 2022-05-11T06:03:01+05:30 IST