Waltair Veerayya: వీరయ్య ఆగమనం ఎప్పుడంటే..?

ABN , First Publish Date - 2022-12-07T22:07:50+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), దర్శకుడు బాబీ(Bobby)ల క్రేజీ కాంబినేషన్‌లో.. మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం

Waltair Veerayya: వీరయ్య ఆగమనం ఎప్పుడంటే..?

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), దర్శకుడు బాబీ(Bobby)ల క్రేజీ కాంబినేషన్‌లో.. మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘వాల్తేర్ వీరయ్య’ (Waltair Veerayya). 2023 సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటూ.. ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలకు సంబంధించి.. విడుదల తేదీలు ఫిక్స్ చేసుకుంటున్న తరుణంలో.. మెగాస్టార్ చిరంజీవి కూడా తన సినిమా విడుదలకు సంబంధించిన డేట్‌ని లాక్ చేశారు. 2023, జనవరి 13వ తేదీన.. ప్రపంచవ్యాప్తంగా వీరయ్య (Veerayya) ఆగమనం అని తెలుపుతూ.. తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. 


ఈ పోస్టర్‌లో మెగాస్టార్‌ని చూసిన వారికి నిజంగానే పూనకాలు రావడం ఖాయం. మాసీ లుక్‌లో మెగాస్టార్ అదుర్స్ అనిపిస్తున్నారు. బోట్‌పై నిలబడి.. మెగాస్టార్ తీక్షణంగా చూస్తున్నారు. ఆయన చేతిలో ఉన్న ఈటెని చూస్తుంటే.. సముద్రంలో పెద్ద యుద్ధమే జరగబోతుందనేది అర్థమవుతుంది. మొత్తంగా మాత్రం.. ఈ లుక్‌తో ఫ్యాన్స్‌కి ముందుగానే పండగ వాతావరణం క్రియేట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన దర్శకుడు బాబీ కొల్లి.. మెగాస్టార్‌ని ఇంతకు ముందెన్నడూ చూడని క్యారెక్టర్‌‌లో ప్రజంట్ చేస్తున్నారు. మరో వీరాభిమాని దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి సరసన శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదలైన పోస్టర్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Waltair Veerayya Release Date locked)



Updated Date - 2022-12-07T22:07:50+05:30 IST