Vyjayanthi movies : ఫ్లాప్ డైరెక్టర్స్‌తో సక్సెస్ కొట్టారు !

ABN , First Publish Date - 2022-08-19T20:23:10+05:30 IST

పది హిట్లిచ్చిన దర్శకుడు ఒక్క ప్లాప్ ఇస్తే చాలు.. ఇండస్ట్రీ అతడ్ని పట్టించుకోవడం మానేస్తుంది. అదే రెండు మూడు ఫ్లాపులిచ్చి ఒక్క హిట్టిచ్చిన దర్శకుడికి మాత్రం పిలిచి మరీ అవకాశాలిస్తుంది. టాలీవుడ్‌లో సక్సెస్ వెనుకే అందరూ పరుగులు తీస్తారు.

Vyjayanthi movies : ఫ్లాప్ డైరెక్టర్స్‌తో సక్సెస్ కొట్టారు !

పది హిట్లిచ్చిన దర్శకుడు ఒక్క ప్లాప్ ఇస్తే చాలు.. ఇండస్ట్రీ అతడ్ని పట్టించుకోవడం మానేస్తుంది. అదే రెండు మూడు ఫ్లాపులిచ్చి ఒక్క హిట్టిచ్చిన దర్శకుడికి మాత్రం పిలిచి మరీ అవకాశాలిస్తుంది. టాలీవుడ్‌లో సక్సెస్ వెనుకే అందరూ పరుగులు తీస్తారు. కానీ ఫ్లాపు దర్శకుల్ని నమ్మి అవకాశాలిచ్చేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. ఒక వేళ అలాంటి నిర్మాతలు అవకాశాలిచ్చి, రాజీలేకుండా సినిమాలు నిర్మిస్తే ఆ దర్శకుల్లో ఎంతో తపన, కసి కనిపిస్తాయి. హిట్టు కొట్టి మరీ తమను తాము నిరూపించుకుంటారు. వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) వారు అలాంటి దర్శకులతోనే రెండు హిట్స్ కొట్టి కాసుల పంటపడించుకున్నారు. ఆ రెండు సినిమాలతోనూ ఆ దర్శకుల దశ తిరిగిపోయింది. 


‘పిట్టగోడ’ (Pittagoda) అనే చిన్న సినిమాతో టాలీవుడ్‌లోకి దర్శకుడిగా అడుగుపెట్టాడు అనుదీప్ కెవి (Anudeep KV). ఆ సినిమా ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. బ్రహ్మాజీ (Brahmaji) తనయుడు సంజయ్ రావు (SanjayRao) ఈ సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతడి టేకింగ్‌కు బాగా ఇంప్రెస్ అయిన వైజయంతీ వారు.. మరో అవకాశమిచ్చారు. కట్ చేస్తే ఈ దర్శకుడు ‘జాతిరత్నాలు’ (Jathiratnalu) చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. చాలా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడీ దర్శకుడు తమిళ హీరో శివ కార్తికేయన్ (Shiva Karthikeyan) తో ‘ప్రిన్స్’ (Prince) చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. 


ఇక ‘అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ, లై, పడిపడి లేచె మనసు’ చిత్రాలతో వరుస పరాజయాలు చవిచూసిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఇంకో అవకాశం ఎవరూ ఇవ్వరని భావించారంతా. అయితే అతడి విజన్ ను నమ్మి.. మంచి బడ్జెట్, అద్భుతమైన టెక్నీషియన్స్‌ను ఇచ్చి ‘సీతారామం’  (Sitraramam) అనే ప్రేమకావ్యాన్ని నిర్మించింది వైజయంతి సంస్థ.  ఆ సినిమా క్లాసిక్ అనిపించుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తోంది. మొత్తం మీద ఫ్లాప్ దర్శకుల్ని నమ్మి వైజయంతి వారు గొప్ప ప్రయోజనమే పొందారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది టాలీవుడ్‌లో. 

Updated Date - 2022-08-19T20:23:10+05:30 IST