Vivek Agnihotri: ‘ది కాశ్మీరీ ఫైల్స్’ డైరెక్టర్ కొత్త సినిమా ఇదే..

ABN , First Publish Date - 2022-11-10T17:33:06+05:30 IST

ఈ ఏడాది బాలీవుడ్‌లో ఎటువంటి అంచనాలు, స్టార్ క్యాస్ట్ లేకుండా విడుదలై సంచలన విజయం అందుకున్న సినిమా ‘ది కాశ్మీరీ ఫైల్స్’..

Vivek Agnihotri: ‘ది కాశ్మీరీ ఫైల్స్’ డైరెక్టర్ కొత్త సినిమా ఇదే..

ఈ ఏడాది బాలీవుడ్‌లో ఎటువంటి అంచనాలు, స్టార్ క్యాస్ట్ లేకుండా విడుదలై సంచలన విజయం అందుకున్న సినిమా ‘ది కాశ్మీరీ ఫైల్స్’ (The Kashmir Files). చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించి దాదపు రూ.350 కోట్ల వసూళ్లని సాధించింది. ఈ సినిమాతో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri)కి చాలామంచి పాపులారిటీ వచ్చింది. అంతేకాకుండా ఆయన తదుపరి సినిమా కోసం ఎంతో మంది సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూసేలా చేసింది.


ఈ తరుణంలోనే సోషల్ మీడియా (Social Media) వేదికగా తన తదుపరి సినిమా టైటిల్ (Title) పేరు చెప్పమంటూ వివేక్ ఓ పోస్ట్ పెట్టాడు. అందులో.. ‘ది -- వార్’ అంటూ రాసుకొచ్చాడు. మధ్యలో ఖాళీని పూరించమంటూ పజిల్ వదిలాడు. తాజాగా చేసిన ట్వీట్‌లో వివేక్ ఆ సినిమా పూర్తి టైటిల్ ప్రకటించాడు. ఆయన చేసిన ట్వీట్‌లో.. ‘ప్రకటన.. ‘ది వ్యాక్సిన్ వార్’ (THE VACCINE WAR)ని తెరకెక్కిస్తున్నాం. భారతదేశం ఓ యుద్ధంలో పోరాడి గెలిచింది. కానీ దాని గురించి మీకు తెలియదు. ఆ అద్భుతమైన నిజమైన కథతో వస్తున్నాం. ఆ యుద్ధంలో సైన్స్, ధైర్యం, గొప్ప భారతీయ విలువలతో గెలిచింది. ఇది 2023 స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల అవుతుంది. మొత్తం 11 భాషల్లో. మమ్మల్ని ఆశీర్వాదించండి’ అని రాసుకొచ్చాడు.


అలాగే మరో పోస్ట్‌లో.. ‘తొలిసారిగా ఒక భారతీయ సినిమా 11 భారతీయ భాషల్లో విడుదల కానుంది. ఈ అద్భుతాన్ని తెరకెక్కించడానికి  ఐయామ్ బుద్ద, ఏఏ ఆర్ట్స్ కలిసి పని చేయనున్నాయి. ఇది మన భారతీయ సినిమా’ అని వివేక్ రాసుకొచ్చాడు. దీంతో.. ఎంతోమంది ఈ పోస్ట్ స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరో అద్భుతమైన కథని మా కళ్లకి చూపించబోతున్నందుకు ధన్యవాదాలు అని ప్రశంసలు కురిపిస్తున్నారు.





Updated Date - 2022-11-10T17:33:06+05:30 IST