Vivek Oberoi: దురదృష్టవశాత్తూ.. క్రికెట్ మీద మాత్రమే దృష్టి పెడుతున్నాం

ABN , First Publish Date - 2022-12-08T20:31:26+05:30 IST

ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఫిఫా ప్రపంచ కప్ (FIFA world cup) ఫీవర్ నడుస్తోంది. ఖతార్‌లో జరగుతున్న ఈ పోటీలను చూడటానికి ఎంతోమంది బాలీవుడ్..

Vivek Oberoi: దురదృష్టవశాత్తూ.. క్రికెట్ మీద మాత్రమే దృష్టి పెడుతున్నాం

ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఫిఫా ప్రపంచ కప్ (FIFA world cup) ఫీవర్ నడుస్తోంది. ఖతార్‌లో జరగుతున్న ఈ పోటీలను చూడటానికి ఎంతోమంది బాలీవుడ్ (Bollywood) ప్రముఖులు వెళ్లారు. తాజాగా వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) సైతం తన కుమారుడు వివాన్‌ (Vivaan)తో కలిసి పోర్చుగల్ వర్సెస్ సౌత్ కొరియా మ్యాచ్‌కు వెళ్లాడు. దీని గురించి తాజాగా వివేక్ మాట్లాడుతూ.. మన దేశంలో క్రీడల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


వివేక్ మాట్లాడుతూ.. ‘‘నా కొడుకు వివాన్‌కి క్రిస్టియానో రొనాల్డోకి వీరాభిమాని. అయితే రొనాల్డోకు ఈ ప్రపంచకప్ చివరిది కావచ్చని బాధపడ్డాడు. నేను నా కొత్త చిత్రం ‘ధారవి బ్యాంక్‌’ను ప్రమోట్ చేసేందుకు, తదుపరి అసైన్‌మెంట్ షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నాను. కానీ నేను వాటికి కొంచెం విరామం తీసుకొని వివాన్‌ని మ్యాచ్ చూపించడానికి తీసుకొచ్చాను.


ఫీఫా వరల్డ్ కప్ నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఆ ఉత్సాహాన్ని అనుభవించే అవకాశాన్ని మిస్ చేయకూడదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులతో కలిసి ఈ పోటీలను చూడడం మరపురాని అనుభవం. అలాగే.. నాకు గనుక అవకాశం వస్తే.. క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే అతను కూడా ఫుట్‌బాల్‌కి వీరాభిమాని’ అని చెప్పుకొచ్చాడు.


‘అన్ని క్రీడల్లోనూ నా దేశం రాణించడాన్ని నేను ఇష్టపడతాను. క్రీడలు వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి అద్భుతంగా పని చేస్తాయి. మనకు చాలా విలువైన జీవిత పాఠాలను నేర్పుతాయి. దురదృష్టవశాత్తూ.. మేము క్రికెట్‌పై మాత్రమే దృష్టి కేంద్రీకరించాం.. కానీ గత దశాబ్ద కాలంగా చాలా ఇతర క్రీడలలోనూ ఎంతోమందిని స్టార్స్‌ని చూశాను. కబడ్డీ, సాకర్ వంటి లీగ్‌లు చాలా మందికి స్ఫూర్తినిస్తున్నాయి. సానియా మీర్జా, మేరీకోమ్, సైనా నెహ్వాల్ వంటి దిగ్గజాలు తరతరాలుగా ఆడపిల్లలను క్రీడల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా స్ఫూర్తినిస్తున్నాయి. అయితే ఆటల్లో తమ పిల్లలను ప్రొత్సాహించే ఆలోచన భారతీయ తల్లిదండ్రుల్లో మనసులో ఉండాలి’ అని తెలిపాడు.

Updated Date - 2022-12-08T20:31:26+05:30 IST