Brahmastra Collections: రూ.20 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఆ సినిమా రికార్డును బ్రేక్ చేసేందుకు ‘బ్రహ్మాస్త్ర’ కు ఎన్ని రోజులు పట్టిందంటే..

ABN , First Publish Date - 2022-09-26T23:27:45+05:30 IST

సెలబ్రిటీ కఫుల్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) హీరో, హీరోయిన్‌లు‌గా నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ’ (Brahmastra Part One: Shiva). అయాన్ ముఖర్జీ దర్శకత్వం

Brahmastra Collections: రూ.20 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఆ సినిమా రికార్డును బ్రేక్ చేసేందుకు ‘బ్రహ్మాస్త్ర’ కు ఎన్ని రోజులు పట్టిందంటే..

సెలబ్రిటీ కఫుల్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) హీరో, హీరోయిన్‌లు‌గా నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ’ (Brahmastra Part One: Shiva). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహార్ నిర్మించాడు. పాన్ ఇండియాగా రూపొందిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదలైంది. ఈ సినిమాకు ఫస్ట్ డే నుంచే మిక్స్‌డ్ ‌టాక్ వచ్చినప్పటికి బాక్సాపీస్ వద్ద సంచలన వసూళ్లను రాబడుతుంది. ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.250కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచింది. గతంలో ఈ రికార్డు ‘ద కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) పేరిట ఉండేది. ఈ మూవీ రికార్డును ‘బ్రహ్మాస్త్ర’ విడుదలయిన 17రోజులకే అధిగమించడం విశేషం.      


‘ద కశ్మీర్ పైల్స్’ ను రూ.20కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కశ్మీర్ పండిత్‌ల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. రూ.250కోట్ల వసూళ్లను సాధించింది. మార్చి‌లో విడుదలైన ఈ మూవీ రికార్డు ‘బ్రహ్మాస్త్ర’ విడుదల వరకు బద్దలు కాలేదు. కానీ, ‘బ్రహ్మాస్త్ర’ మాత్రం విడుదలైన 17రోజులకే ఈ మూవీ రికార్డును అధిగమించింది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్‌ను సాధించిన చిత్రంగా నిలిచింది. ‘బ్రహ్మాస్త్ర’ రాబోయే రోజుల్లో రూ.300కోట్ల వసూళ్లను రాబడుతుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాకు నేషనల్ సినిమా డే సందర్భంగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూ.75కే టికెట్‌ను అందించడంతో దాదాపుగా 15లక్షల మంది సినిమా లవర్స్ ఈ మూవీని వీక్షించారు. టికెట్ ధర తక్కువగా ఉంటే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారని ‘బ్రహ్మాస్త్ర’ మేకర్స్ అర్థం చేసుకున్నారు. అందువల్ల తక్కువ ధరకే టికెట్‌ను అందిచాలని నిర్ణయించుకున్నారు. నవరాత్రి సందర్భంగా ‘బ్రహ్మాస్త్ర’ టికెట్‌ను రూ.100కే అందించనున్నామని చిత్ర బృందం ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి సెప్టెంబర్ 29వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. కానీ, ప్రభుత్వ నియమ, నిబంధనల ఫలితంగా ఈ ఆఫర్ కొన్ని రాష్ట్రాల్లో అందుబాటులో ఉండదు. హైదరాబాద్‌లో టికెట్‌ను రూ.112కు అందించే అవకాశం ఉంది. 



Updated Date - 2022-09-26T23:27:45+05:30 IST