ఆ సినిమా రేటింగ్‌ తగ్గించిన ఐఎండీబీ.. అనైతికమంటూ..

ABN , First Publish Date - 2022-03-15T16:50:25+05:30 IST

‘ది కాశ్మీరీ ఫైల్స్’.. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరూ చర్చించుకుంటున్నారు...

ఆ సినిమా రేటింగ్‌ తగ్గించిన ఐఎండీబీ.. అనైతికమంటూ..

‘ది కాశ్మీరీ ఫైల్స్’.. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరూ చర్చించుకుంటున్నారు. 1990 వలసల సమయంలో కాశ్మీరీ పండిట్లపై జరిగిన దురాగతాల గురించి వివేక్ అగ్నిహోత్రి తీసిన ఈ చిత్రం సంచలనాలు సృష్టిస్తోంది. అనుపమ్ ఖేర్ ముఖ్యపాత్రలో నటించి ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ దూసుకుపోతోంది. అంతేకాకుండా ఈ చిత్రానికి ఐఎండీబీ మొదట 10కి 10 ఇవ్వగా.. దాన్ని సవరిస్తూ 8.3గా మార్చింది. అంతేకాకుండా దీని గురించి ఐఎండీబీ యాజమాన్యం తాజాగా చేసిన ఓ ట్వీట్ సైతం వివాదాస్పదమైంది. 


ఈ సినిమాకి సంబంధించి 1,35,000 మంది ఓటింగ్ చేయగా.. అందులో 94 శాతం మంది 10కి 10, మిగిలినవారు 1 రేటింగ్ ఇచ్చారు. దీంతో యావరేజ్‌గా 8.3గా వచ్చింది. దీనిపై ఐఎండీబీ చేసిన ట్వీట్‌లో.. ‘మా రేటింగ్ మెకానిజం ఈ టైటిల్‌పై అసాధారణ ఓటింగ్ కార్యాచరణను గుర్తించింది. మా రేటింగ్ సిస్టమ్ విశ్వసనీయతను కాపాడటానికి , ప్రత్యామ్నాయ వెయిటింగ్ గణనను ఈ మూవీ అనువదిస్తున్నాం. వివేక్ అగ్నిహోత్రి కావాలనే రేటింగ్స్‌ని ప్రభావితం చేస్తున్నాడు’ అని రాసుకొచ్చింది.


అంతేకాకుండా.. ‘మేము పోలైన అన్ని ఓట్లని తీసుకున్నప్పటికీ అందులో విలువైన వాటినే రేటింగ్ అర్హత కలిగినవిగా పరిగణిస్తాం. సులువైన పద్ధతిలో చెప్పాలంటే.. ఎంతోమంది ఈ ఓట్లు వేసినప్పటికీ అందులో అందరూ ఎటువంటి వాటికి లొంగకుండా ఓట్లు వెయ్యకపోవచ్చు. అటువంటి వాటి నుంచి మా విశ్వసనీయత కాపాడుకునేందుకు మాకు ప్రత్యేక సిస్టం ద్వారా రేటింగ్ ఇస్తాం. అయితే ఆ ప్రత్యామ్నాయ సిస్టం గురించి బయటికి చెప్పలేం’ ఐఎండీబీ యాజమాన్యం వివరించింది. దీనిపై ఈ మూవీ డైరెక్టర్ వివేక్ స్పందిస్తూ.. ‘ఇది అసాధారణం, అనైతికం’ అంటూ కామెంట్ చేశాడు.



Updated Date - 2022-03-15T16:50:25+05:30 IST