Vivek Agnihotri: బాయ్‌కాట్ లాల్‌సింగ్ చడ్డాపై స్పందించిన డైరెక్టర్.. బాలీవుడ్ డాన్స్ అలా చేసినప్పుడూ..

ABN , First Publish Date - 2022-08-15T19:33:06+05:30 IST

‘ది కాశ్మీర్ ఫైల్స్(The Kashmir Files)’.. సినిమాతో బాలీవుడ్‌తోపాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి..

Vivek Agnihotri: బాయ్‌కాట్ లాల్‌సింగ్ చడ్డాపై స్పందించిన డైరెక్టర్.. బాలీవుడ్ డాన్స్ అలా చేసినప్పుడూ..

‘ది కాశ్మీర్ ఫైల్స్(The Kashmir Files)’.. సినిమాతో బాలీవుడ్‌తోపాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri). 1992లో కశ్మీరీ పండిట్ల మీద జరిగిన దురాగతాలపై ఈ మూవీ తెరకెక్కింది. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న మూవీ విడుదలైన ఈ మూవీ దాదాపు రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లని కొల్లగొట్టింది. కాగా.. ఇటీవల ఎక్కువగా బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రభావం ఎక్కువగా స్టార్ హీరోలైనా ఆమీర్ ఖాన్ సినిమా ‘లాల్ సింగ్ చడ్డా(Laal Singh Chaddha)’, అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’పై పడింది. దీనిపై తాజాగా ఈ దర్శకుడు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.


వివేక్ సోషల్ మీడియాలో చేసిన పోస్టులో.. ‘మంచి కంటెంట్ చిన్న సినిమాలను విధ్వంసం చేసి.. బాలీవుడ్ డాన్‌లు బహిష్కరించినప్పుడు.. వాటి షోలను మల్టీప్లెక్స్‌ల నుంచి తీసివేసినప్పుడు.. సీనీ విశ్లేషకులు అందరూ ఒకటై చిన్న చిత్రాలకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు.. ఆ సినిమా కోసం కష్టపడి పనిచేసిన 250 మంది పేదల గురించి ఎవరూ ఆలోచించలేదు కదా’ అని రాసుకొచ్చాడు. 


అలాగే మరో ట్వీట్‌లో.. ‘బయటి నటులు, దర్శకులు, రచయితలను బాలీవుడ్ కింగ్స్ బహిష్కరించి వారి కెరీర్‌లను నాశనం చేశారు. అప్పుడు బాలీవుడ్ నుంచి ఎవరూ ఎందుకు మాట్లాడలేదు? బాలీవుడ్ డాన్‌ల అహంకారం, ఫాసిజం, హిందూ ఫోబియా గురించి సాధారణ భారతీయులకు తెలిసిన రోజు.. వారిని వేడి కాఫీలో పడేస్తారు’ అని వివేక్ రాసుకొచ్చాడు.





Updated Date - 2022-08-15T19:33:06+05:30 IST