Sita Ramam: తెలుగు సినిమాపై బాలీవుడ్ దర్శకుడి ప్రశంసలు

ABN , First Publish Date - 2022-09-19T23:31:41+05:30 IST

మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘సీతారామం’...

Sita Ramam: తెలుగు సినిమాపై బాలీవుడ్ దర్శకుడి ప్రశంసలు

మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), రష్మికా మందన్నా (Rashmika Mandanna) ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘సీతారామం (Sita Ramam)’. గత నెల విడుదలైన ఈ చిత్రం ప్రేమకథల్లో దృశ్యకావ్యంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినీ లవర్స్‌తో పాటు ఎంతోమంది సినీ ప్రముఖులు సైతం ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మూవీ ఇటీవలే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌ విడుదలైంది.  తాజాగా ఈ సినిమాని చూసిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) సైతం ఈ సినిమాని సోషల్ మీడియా వేదికగా అభినందించారు.


వివేక్ ట్విట్టర్‌లో చేసిన ట్వీట్‌లో.. ‘నిన్న రాత్రి నేను హను రాఘపూడి తీసిన సీతారామం చూశాను. అందులో దుల్కర్‌ని చూడటం చాలా రిఫ్రెష్‌గా అనిపించింది. చాలా ఇంప్రెస్ అయ్యాను. అది అతని నిజాయతీ నుంచి వచ్చింది. ఇక మృణాల్ గురించి ఏమని చెప్పాలి. ఆమె నటనను చూడటం ఇదే మొదటిసారి. చాలా నిజాయతీగా నటించింది. త్వరలో ఆమె పెద్ద స్టార్ అవుతుంది. అభినందనలు!’ అని రాసుకొచ్చాడు.


వివేక్ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు సైతం స్పందిస్తూ ఈ మూవీ నటీనటులు, దర్శకుడు, నిర్మాతలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందులో ఓ నెటిజన్.. ‘నేను కూడా నిన్న రాత్రి సినిమా చూశాను. చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. మృణాల్‌ని ఇంతకుముందు రెండు, మూడు బాలీవుడ్ మూవీస్‌లో చూశా. కానీ.. ఈ సినిమాలో ఇలా చూసి ఆశ్చర్యపోయాను. నీకు చాలా భవిష్యత్తు ఉంది. దుల్కర్ ఎప్పటిలాగే నటనలో జీవించేశాడు‌’ అని రాసుకొచ్చాడు. మరో నెటిజన్ సైతం.. ‘గడిచిపోయిన కాలాన్ని కథ వస్తువుగా తీసుకుని ప్రేక్షకులను మెప్పించడం అంత సులువు కాదు. అది ఈ సినిమా టీం చేయగలిగింది. అందమైన కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, సంగీతం, పాటలు, రొమాన్స్‌లో సెంటిమెంట్‌లను చూపించిన విధానం చాలా బావున్నాయి’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా.. మరికొందరూ సైతం ఈ మూవీని పొగుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. 1992లో కశ్మీర్‌లో కశ్మీరి పండిట్లపై జరిగిన దురగతాలు, అరాచకాల ఆధారంగా తెరకెక్కిన ‘ది కాశ్మీరీ ఫైల్స్’ చిత్రానికి భారతీయ ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ప్రపంవవ్యాప్తంగా రూ.350కోట్ల పైగా కలెక్షన్లని కొల్లగొట్టింది అంటేనే.. ఆ సినిమాకి ప్రేక్షకులు ఎంతలా కనెక్ట్ అయ్యారో అర్థమవుతోంది.



Updated Date - 2022-09-19T23:31:41+05:30 IST