Vishwak Sen: ఈగలాంటి వాడిని.. నలుగురు కలిసి కొడితే పడిపోతాను

ABN , First Publish Date - 2022-05-05T01:39:16+05:30 IST

యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen), రుక్సార్ థిల్లాన్ (Rukshar Dhillon) హీరోహీరోయిన్లుగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్ (BVSN Prasad) స‌మర్పణలో విద్యాసాగ‌ర్ చింతా

Vishwak Sen: ఈగలాంటి వాడిని.. నలుగురు కలిసి కొడితే పడిపోతాను

యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen), రుక్సార్ థిల్లాన్ (Rukshar Dhillon) హీరోహీరోయిన్లుగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్ (BVSN Prasad) స‌మర్పణలో విద్యాసాగ‌ర్ చింతా (Vidyasagar Chinta) ద‌ర్శకత్వంలో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు (Bapineedu), సుధీర్ ఈద‌ర‌ (Sudheer Edara) నిర్మించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ (Ashoka Vanamlo Arjuna Kalyanam). ‘రాజాగారు రాణివారు’ (RajaGaru Ranivaru) చిత్ర డైరెక్టర్ రవి కిరణ్ కోలా (Ravikiran Kola) ఈ సినిమాకి కథ, మాట‌లు, స్క్రీన్‪ప్లే అందించారు.  మే 6న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మంగళవారం  ఖమ్మంలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. 


ఈ కార్యక్రమంలో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో అర్జున్ అల్లం పాత్రలో నటించాను. అర్జున్ అల్లంకి కాస్త భయం ఎక్కువ.. ఇన్ సెక్యూరిటీగా ఫీలవుతుంటాడు.. మనందరిలానే.. పాతికేళ్లు రాగానే చదువు.. ముప్పై ఏళ్లు రాగానే సెటిల్ అవ్వాలి.. పెళ్లి చేసుకోవాలి.. ఇలాంటి ఇన్‌సెక్యూరిటీస్‌తోనే ఉంటాడు. 35 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకుంటే తప్పా? జైల్లో వేస్తారా? ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే కూడా తప్పుగానే చూస్తారు. మనం మన గర్ల్ ఫ్రెండ్స్‌‌ని సమంత (Samantha), ఐశ్వర్యా రాయ్‌(Aishwarya Rai)లతో పోల్చితే.. వాళ్లు మనల్ని ఎలా ఉండాలని అనుకుంటున్నారో అని భయపడాల్సి వస్తుంది. అమ్మాయిలకు కూడా చెబుతున్నా.. మీరు మీ ఫ్రెండ్.. బాయ్ ఫ్రెండ్‌‌తో కంపేర్ చేయవద్దు.. అలా చేస్తూ కలిసి ఉన్నారంటే.. మీరు సగం చచ్చినట్టే. మన ఇంటికి చుట్టాలు వస్తారు.. మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని అడుగుతారు. ఆ తరువాత ఇంట్లో పెద్ద చర్చే జరుగుతుంది.. మనందరం కూడా ఈ భయాలతో బతుకుతాం.. అలా బతకొద్దు. ఇవన్నీ రిలేటబుల్ అయినోడే అర్జున్ అల్లం (Arjun Allam). 33 ఏళ్లు ఇలానే బతుకుతాడు.. వాటి నుంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకుని ఎలా ఉన్నాడనేది ఈ కథ. ప్రతి ఒక్కరూ మనసుపెట్టి ఈ చిత్రం చేశారు. నా కెరీర్‪లో భారీ క్లాస్ మూవీ ఇదే.  మళ్లీ మళ్లీ ఈ టీమ్‪తో పని చేయాలనుకుంటున్నాను. ఇది నా కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అవుతుంది. ప్రేక్షకులు ఈ సినిమా చూస్తూ నవ్వుతారు.. భయపడతారు.. ఆనందం ఎక్కువై ఏడుస్తారు. అందరూ ఫ్యామిలీతో ఈ సినిమాని చూడండి.


ఇవే నా సినిమా కష్టాలు

నేను చేసింది 4 సినిమాలే.. అయినా వాటి మ్యాషప్ చూసి ఎమోషనల్ అయ్యాను. ఇంత వరకు నా సినిమా కష్టాల గురించి ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు చెప్పాలని అనుకుంటున్నా. ఎవరైనా ఇంట్లో హీరో అవుతాను అని చెబితే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. కానీ నన్ను మాత్రం మా అమ్మ నమ్మింది. ఆ తరువాత నాన్న నమ్మాడు. ఎంతో కష్టపడి ఫిల్మ్ కోర్సులు నేర్చుకున్నాను. డ్యాన్స్, యాక్టింగ్ అన్నీ నేర్చుకున్నాను. 12 లక్షలు పెట్టి ‘వెళ్లిపోమాకే..’ (Vellipomakey) చేశాను.. నిర్మాతకు నచ్చి కొని రిలీజ్ చేశాడు. అదే పెద్ద సక్సెస్.. నా దగ్గర ఏం లేని సమయంలో తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) నన్ను పెట్టి సినిమా తీశాడు. ఆయనకు థ్యాంక్స్. 


అలా స్టూడియోలో నుండి వచ్చే వాడిని కాదు

అమ్మా నీకు ఒకటి చెబుతున్నా.. నీ కొడుక్కి ఏం కాదు.. ఎవరూ ఏమీ చేయలేరు. నేను అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వనని అంటున్నారు. అదే నిజమైతే.. ఆ రోజు స్టూడియోలో నుండి అలా వచ్చి ఉండేవాడిని కాదు. అది నువ్వు నీ కొడుక్కి నేర్పిన సంస్కారం. నాకు బ్యాక్ గ్రౌండ్ లేదు. చిన్న ఈగలాంటివాడిని.. నలుగురు కలిపి కొడితే పడిపోతాను. కానీ నాకు ఇప్పుడు రక్షణగా అభిమానులు (Fans) ఉన్నారు. అభిమానులు పెట్టిన మెసెజ్‌లు చేశాను. అవి చూశాక.. వారే నా ఆస్తి.. నన్ను ఎవ్వరూ ఏం చేయ‌లేరు అనిపించింది. నాకు మీరున్నారు.. డౌట్ వస్తే.. హ్యాష్ ట్యాగ్ విశ్వక్ సేన్ అని కొట్టి చూడండని చెబుతాను. నా కోసం నిలబడిన అందరికీ థ్యాంక్స్. నేను చెప్పుకునేది ఒక్కటే.. నాకు మీరు (అభిమానులు) తప్ప ఎవ్వరూ లేరు..’’ అన్నారు. 

Updated Date - 2022-05-05T01:39:16+05:30 IST