నా సినిమా బతకడం కోసం ఏమైనా చేస్తా: విశ్వక్‌సేన్‌

ABN , First Publish Date - 2022-05-02T23:40:34+05:30 IST

తన సినిమా ప్రచారం కోసం ఫ్రాంక్‌ వీడియోల పేరుతో న్యూసెన్స్‌ క్రియేట్‌ చేశారంటూ నటుడు విశ్వక్‌సేన్‌పై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది అరుణ్‌ కుమార్‌ ఈ పిటిషన్‌లో పేర్కొన్నట్టు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్లు చేయనివ్వకుండా చూడాలని హెచ్‌.ఆర్‌.సి.ని కోరినట్టు ఆయన చెప్పారు.

నా సినిమా బతకడం కోసం ఏమైనా చేస్తా: విశ్వక్‌సేన్‌

తన సినిమా ప్రచారం కోసం ఫ్రాంక్‌ వీడియోల పేరుతో న్యూసెన్స్‌ క్రియేట్‌ చేశారంటూ నటుడు విశ్వక్‌సేన్‌పై  మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది అరుణ్‌ కుమార్‌ ఈ పిటిషన్‌లో పేర్కొన్నట్టు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్లు చేయనివ్వకుండా చూడాలని హెచ్‌.ఆర్‌.సి.ని కోరినట్టు ఆయన చెప్పారు. విశ్వక్‌ సేన్‌ హీరోగా తెరకెక్కిన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లోని ఓ కాలనీ రోడ్డుపై ఫ్రాంక్‌ వీడియో చేసింది. ఇందులో.. ఓ వ్యక్తి చనిపోతానంటూ బెదిరించడం కలకలం రేపింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో హైకోర్టు న్యాయవాది అరుణ్‌ కుమార్‌ హెచ్‌ఆర్‌సీలో విశ్వక్‌పై ఫిర్యాదు చేశారు.


దీనిపై విశ్వక్‌సేన్‌ స్పందించారు. ‘‘నేను నటించిన నాలుగో చిత్రమిది. నా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఏమైనా చేస్తా. సినిమాను బతికించుకోవలసిన బాఽధ్యత నాపై ఉంది. ప్రమోషన్‌ కోసం రెండు నిమిషాల ఫ్రాంక్‌ వీడియో చేశా. అందులో పెట్రోల్‌కు బదులు నీళ్లు వాడాం. ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి పిటీషన్‌లో పెట్రోల్‌ అని పేర్కొన్నారు. దానిని సాకుగా తీసుకుని బతుకుతెరువు కోసం ఫ్రాంక్‌ వీడియోలు చేసే అందరి మీద కేస్‌ వేస్తానని అనడం న్యాయం కాదు. వాళ్లు చాలా చిన్న మనుషులు. వారిని బతకనిద్దాం. నేను ఎన్నో కష్టాలు చూసి ఇక్కడి వరకూ వచ్చా. నాకు ఏదైనా సమస్య వచ్చినా నేను తట్టుకోగలను. కానీ వారు తట్టుకోలేరు. నా వల్ల వాళ్లకు ఇబ్బంది కలిగితే నాకు గిల్టీగా ఉంటుంది’’ అని అన్నారు. విద్యాసాగర్‌ చింతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయికగా నటించింది. బాపినీడు, సుధీర్‌ ఈదర సంయుక్తంగా నిర్మించారు. 


Updated Date - 2022-05-02T23:40:34+05:30 IST