నానీ వైరస్ గండం గడిచి గట్టెక్కుతాడా?

ABN , First Publish Date - 2021-12-09T17:31:03+05:30 IST

కొందరు హీరోలకు ఏదో సందర్భంలో దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. చివరికి అది బ్యాడ్ సెంటిమెంట్ గా మారుతుంది. నేచురల్ స్టార్ నానీని తాజా సినిమా విషయంలో ఇలాంటి ఓ గండంలాంటి సెంటిమెంట్ పట్టిపీడిస్తోంది. అది కూడా వైరస్ రూపంలో. నానీ, సుధీర్ బాబు నటించిన ‘వి’ సినిమాను గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేయాలనుకున్నారు. అయితే ఆ ప్రయత్నానికి కరోనా ఫస్ట్ వేవ్ గండికొట్టింది. ఆఖరికి ఆ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాల్సి వచ్చింది.

నానీ వైరస్ గండం గడిచి గట్టెక్కుతాడా?

కొందరు హీరోలకు ఏదో సందర్భంలో దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. చివరికి అది బ్యాడ్ సెంటిమెంట్ గా మారుతుంది. నేచురల్ స్టార్ నానీని తాజా సినిమాని ఇలాంటి ఓ గండంలాంటి సెంటిమెంట్ పట్టిపీడిస్తోంది. అది కూడా వైరస్ రూపంలో.  నానీ, సుధీర్ బాబు నటించిన ‘వి’ సినిమాను గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేయాలనుకున్నారు. అయితే ఆ ప్రయత్నానికి కరోనా ఫస్ట్ వేవ్ గండికొట్టింది. ఆఖరికి ఆ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాల్సి వచ్చింది. రిజల్ట్ మనకు తెలిసిందే. అలాగే.. నానీ నటించిన ‘టక్ జగదీష్’ సినిమాకి కూడా అదే కరోనా అడ్డుపడడం బ్యాడ్‌లక్కే మరి. థియేటర్స్ లో విడుదల చేయాలనుకున్నప్పటికీ కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చడంతో ఆఖరికి దాన్ని కూడా అమెజాన్ ప్రైమ్ లోనే విడుదల చేశారు. 


ఇక ఇప్పుడు నానీ తదుపరి చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ వంతు వచ్చింది. డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఆ టైమ్ కి కరోనా థర్డ్ వేరియంట్ ఒమిక్రాన్ మరింత బలపడుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ టైమ్ కి దాని తీవ్రత ఎంతలా ఉంటుందో తెలియదు. ఒకవేళ అది కానీ మళ్ళీ విజృంభిస్తే మళ్ళీ థియేటర్స్ మూతపడక తప్పదు. ఆ కారణంగా ఈ సినిమాని ఓటీటీలోనే విడుదల చేయాల్సి వస్తుందని అనుకుంటున్నారు. అయితే అలాంటిదేమీ లేదని, అవి ఒట్టి రూమర్సేనని కొందరు దీన్ని ఖండిస్తున్నారు. మరి ‘శ్యామ్ సింగరాయ్’ వైరస్ గండం గడిచి గట్టెక్కుతాడో లేదో చూడాలి. 

Updated Date - 2021-12-09T17:31:03+05:30 IST