Virataparvam: నిఖిల్ రివ్యూ..ఏమన్నాడంటే..!

ABN , First Publish Date - 2022-06-09T14:39:24+05:30 IST

రానా (Rana), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా కలిసి నటించిన చిత్రం ‘విరాటపర్వం’ (Virataparvam). ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకుడు. (Venu Udugula) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన

Virataparvam: నిఖిల్ రివ్యూ..ఏమన్నాడంటే..!

రానా (Rana), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా కలిసి నటించిన చిత్రం ‘విరాటపర్వం’ (Virataparvam). ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకుడు. (Venu Udugula) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రొమోషన్స్‌ని మొదలు పెట్టిన చిత్రయూనిట్, బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వదులుతున్నారు. ఇప్పటివరకు బయటకి వచ్చిన అప్డేట్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఇక దర్శకుడు వేణు ఊడుగుల ఈ చిత్ర కథని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించానని చెప్పాడు. ఆ వాస్తవ సంఘటనలు ఏంటంటే, బెల్లీ లలిత (Belli Lalitha) జీవితం ఆధారంగా విరాటపర్వం సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. 


అయితే, తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో విరాట పర్వం సినిమాపై తన రివ్యూను చెప్పేశాడు. "ఈ ఎపిక్ లవ్ స్టోరీ నన్ను కాస్త షాక్‌కు గురిచేసింది. అంతేకాదు.. సినిమా చాలా అద్భుతంగా ఉంది"..అని ట్వ్వీట్ చేశారు. 'సాయి పల్లవి కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చింది. రానా దగ్గుబాటి నటన కూడా చాలా బాగుంది'.. అని పోస్ట్‌లో రాసుకొచ్చాడు నిఖిల్. 'ఈ సినిమాను అద్భుతమైన వీక్షణగా మార్చిన వేణు ఊడుగులకి మరియు సుధాకర్ చెరుకూరికి హ్యాట్సాఫ్'.. అని పేర్కొన్నాడు. దీనితో ఈ ‘విరాటపర్వం’పై అందరిలో ఆసక్తి మరింత పెరిగింది.


ఫిదా సినిమా నుంచి గత చిత్రం లవ్ స్టోరి వరకు తా నేచురల్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించిన సాయి పల్లవి విరాటపర్వం సినిమాలో బెల్లి లలితగా ఎంతవరకూ ఆకట్టుకుంటున్దో చూడాలి. ఇక ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్, నివేతా పేతురాజ్ కీలక పాత్రల్లో కపించబోతున్నారు. కాగా, డి. సురేష్ బాబు (D Suresh Babu) స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ (SLV Cinemas) ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ సినిమాని నిర్మించారు. సురేష్ బొబ్బిలి (Suresh Bobbili) సంగీత  దర్శకుడు.



Updated Date - 2022-06-09T14:39:24+05:30 IST