Sai Pallavi: ట్విట్టర్ ట్రెండింగ్‌లో సాయిపల్లవి.. ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై చేసిన ఆ వ్యాఖ్యలే కారణం..

ABN , First Publish Date - 2022-06-15T23:02:23+05:30 IST

హీరోయిన్ సాయి పల్లవి. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచతమైన పేరు. పట్టుమని పది సినిమాలు కూడా తెలుగులో చేయకపోయినప్పటికీ ‘ఫిదా’ అనే ఒకే ఒక్క సినిమాతో..

Sai Pallavi: ట్విట్టర్ ట్రెండింగ్‌లో సాయిపల్లవి.. ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై చేసిన ఆ వ్యాఖ్యలే కారణం..

హీరోయిన్ సాయి పల్లవి. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచతమైన పేరు. పట్టుమని పది సినిమాలు కూడా తెలుగులో చేయకపోయినప్పటికీ ‘ఫిదా’ అనే ఒకే ఒక్క సినిమాతో ఈ భానుమతి అందరి మనసులను గెలుచుకుంది. కట్టుబొట్టు విషయంలో కూడా హీరోయిన్ సాయి పల్లవిని చాలా మంది ఇష్టపడుతుంటారు. గ్లామర్ రంగమైన సినిమా ఇండస్ట్రీలో పద్ధతైన వస్త్రధారణతో కూడా రాణించవచ్చని రుజువు చేసిన ఈ హైబ్రిడ్ పిల్ల పేరు తాజాగా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. #SaiPallavi అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.



సాయి పల్లవి నటించిన తెలుగు సినిమా ‘విరాట పర్వం’ ప్రమోషన్స్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలే ట్విట్టర్‌లో ఈ ట్రెండ్‌కు కారణం. 1990ల్లో కశ్మీరీ పండితులపై జరిగిన అమానుషాలను, నర మేధాన్ని ‘The Kashmir Files’ పేరుతో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సినిమాగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఎవరి వాదనలు ఎలా ఉన్నా బాక్సాఫీస్ వద్ద హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా గురించి సాయి పల్లవి ‘విరాట పర్వం’ సినిమా ప్రమోషన్స్‌లో మాట్లాడింది. ఆమె ఏం చెప్పిందంటే..



‘‘కొన్ని రోజుల క్రితం ‘The Kashmir Files’ అనే సినిమా విడుదలైంది కద. 1990వ సంవత్సరంలో కశ్మీరీ పండిట్లు ఎలా చంపబడ్డారో ఈ సినిమాలో చూపించారు. ఆ సమయంలో కశ్మీర్‌లో నివసిస్తున్న కశ్మీరీ పండితులను ఎలా చంపారో సినిమాలో చూపించారు కద. కోవిండ్ సమయంలో అనుకుంటా. ఆవును ఒక వాహనంలో తరలిస్తుండగా ఆపారు. ఆ వాహనం నడుపుతున్న వ్యక్తి ఒక ముస్లిం. ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేస్తూ కొందరు అతనిపై దాడి చేశారు. ‘కాశ్మీర్ ఫైల్స్’లో చూపించిన ఆ ఘటన, ఈ ఘటన. ఈ రెండు ఘటనలకు మధ్య తేడా ఎక్కడుంది..? ఈ రెండు ఘటనల్లో ఏ ఘటనలో మా నాన్న బాధితుడిగా ఉండి ఉన్నా నేను బాధపడి ఉండేదాన్ని. ఈ రెండు ఘటనల్లో హింస ఉంది. మా గోమాతను మీరు ఎలా బాధిస్తారని హిందువుల నమ్మకం. కశ్మీర్‌లో ముస్లింలు కూడా ‘ఇది మా ఊరు’ అని వాళ్ల నమ్మకం’’ అని సాయి పల్లవి ‘విరాట పర్వం’ సినిమా ప్రమోషన్‌లో మాట్లాడింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ ట్విట్టర్‌లో ఆమె పేరును ట్రెండ్ చేస్తున్నారు.

Updated Date - 2022-06-15T23:02:23+05:30 IST