జంతువుల్ని చంపకుండానే... Anushka, Virat ‘మాంసం దందా’!

ABN , First Publish Date - 2022-02-09T00:32:58+05:30 IST

ముంబై కేంద్రంగా పని చేసే స్టార్టప్ ‘బూ ట్రైబ్ ఫుడ్స్’లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ పెట్టుబడులు పెట్టారు. అయితే, అసలు విశేషం ఏంటంటే... ‘బ్లూ ట్రైబ్ ఫుడ్స్’ ఒక మాంసం ఉత్పత్తుల సంస్థ. కానీ, ఎటువంటి జంతు వధని కూడా అక్కడ చేయరు! మూగజీవాల్ని హింసించకుండా మాంసం వచ్చేది ఎలా అంటారా?

జంతువుల్ని చంపకుండానే... Anushka, Virat ‘మాంసం దందా’!

ముంబై కేంద్రంగా పని చేసే స్టార్టప్ ‘బూ ట్రైబ్ ఫుడ్స్’లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ పెట్టుబడులు పెట్టారు. అయితే, అసలు విశేషం ఏంటంటే... ‘బ్లూ ట్రైబ్ ఫుడ్స్’ ఒక మాంసం ఉత్పత్తుల సంస్థ. కానీ, ఎటువంటి జంతు వధని కూడా అక్కడ చేయరు! మూగజీవాల్ని హింసించకుండా మాంసం వచ్చేది ఎలా అంటారా? తాజాగా శాస్త్రవేత్తలు అందుకు తగిన పద్ధతుల్ని కనిపెట్టారు. వాటి ఆధారంగా ‘బ్లూ ట్రైబ్ ఫుడ్స్’ మొక్కల్లోంచి మాంసాన్ని రాబట్టి మార్కెట్లో అమ్మబోతోంది... 


‘‘మేం కేవలం మొక్కల ద్వారా లభించే ఆహారం మాత్రమే తీసుకుంటున్నాం. అంటే... మాంసానికి పూర్తిగా దూరం అన్నమాట’’ అంటున్నారు విరాట్ అండ్ అనుష్క శర్మ. అంతే కాదు, తాము నాన్ వెజ్‌ ఎందుకు వద్దనుకున్నారో స్టార్ కపుల్ వివరిస్తున్నారు. ‘‘మేం జంతు ప్రేమికులం కాబట్టి మాత్రమే మాంసాహారం మానేయలేదు. మాంసం తినటం వల్ల మన చుట్టూ ఉండే ప్రపంచంపై ఎంతో ప్రభావం పడుతుంది... కాకపోతే, కొన్నిసార్లు మీట్ టేస్ట్‌ని మిస్ అవుతుంటాం!’’ అని చెప్పుకొచ్చారు విరుష్క. 


తాము వ్యక్తిగతంగా జంతు మాంసం మానేయటమే కాదు. ఇతరులు కూడా మానేయాలని అనూ, కోహ్లీ కోరుకుంటున్నారు. అందుకే, ముంబై కేంద్రంగా నడిచే ఓ వ్యాపార సంస్థలో పెట్టుబడి పెట్టారు. అక్కడ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి చెట్ల మొక్కల్లోంచి మాంసం ఉత్పత్తి చేస్తారు. తద్వారా నాన్ వెజ్ ప్రియులకి ముక్క నోట్లోకి వెళ్లినట్టూ ఉంటుంది. జంతు హింస జరగకుండా కూడా ఉంటుంది. ఈ ఐడియా అండ్ బిజినెస్ బాగానే ఉన్నట్టుంది కదా... 

Updated Date - 2022-02-09T00:32:58+05:30 IST