Pushpa 2 : విలన్స్ సంఖ్య పెరుగుతోంది !

ABN , First Publish Date - 2022-08-29T19:30:13+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబో మూవీ ‘పుష్ప’ (Pushpa) ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లోనూ చిత్రం భారీ వసూళ్ళు రాబట్టింది. బాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద అయితే పుష్పరాజ్ దండయాత్ర మామూలుగా లేదు.

Pushpa 2 : విలన్స్ సంఖ్య పెరుగుతోంది !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబో మూవీ ‘పుష్ప’ (Pushpa) ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లోనూ చిత్రం భారీ వసూళ్ళు రాబట్టింది. బాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద అయితే పుష్పరాజ్ దండయాత్ర మామూలుగా లేదు. ప్రపంచ వ్యాప్తంగా హైయస్ట్ గ్రాస్ వసూలు చేసి బన్నీ కెరీర్ బెస్ట్ మూవీ అయిపోయింది. దీంతో ‘పుష్ప’ రెండో భాగంపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఇండియా వైడ్‌గా ఎంతో ఆసక్తి కనబరుస్తున్న చిత్రం ‘పుష్ప : ది రూల్’ (Pushpa the rule). మొదటి భాగం సక్సెస్‌తో ఊపందుకున్న అంచనాల్ని అందుకోడానికి సుకుమార్ అండ్ టీమ్ చాలా కష్టపడుతోంది. స్ర్కిప్ట్ మీద చాలా సమయం వెచ్చించడం వల్ల సినిమా అనుకున్న టైమ్‌కు పట్టాలెక్కలేకపోయింది. 


ఇటీవల ‘పుష్ప 2’ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛయింది. సెప్టెంబర్‌లో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నట్టు సమాచారం. రెండో భాగానికి ఫహద్ ఫాజిల్ (Fahad Fazil) ప్రధాన విలన్ అవుతాడని.. బన్నీ, ఫహద్‌ల పోరు నేపథ్యంలో ప్రధాన కథ నడుస్తుందని అందరికీ అంచనా ఉంది. ఈ దిశగా పుష్ప మొదటి భాగం క్లైమాక్స్ లో సుకుమార్ హింటిచ్చి వదిలేశాడు. ఇక ఫహద్‌తో పాటు సునీల్, అనసూయ, ధనుంజయ ఇలా బన్నీని టార్గెట్ చేసే వారి సంఖ్య ఎక్కువే. అయితే వీరి సంఖ్య చాలదన్నట్టు ఇందులో మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కూడా ఓ విలన్ గా నటించబోతున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అందులో అతడు సీనియర్ పోలీసాఫీసర్ గా నటిస్తాడని, పుష్పరాజ్ పాత్రకు అతడు కూడా ప్రధాన శత్రువేని టాక్స్ వినిపించాయి. 


ఇప్పుడు లిస్ట్ లోకి మరో కొత్త విలన్ కూడా వచ్చి చేరుతున్నట్టు సమాచారం. పార్ట్ 1 లో ఎర్రచందనం సిండికేట్ కు పుష్పను కింగ్ ను చేసి యం.పీ రావురమేశ్ పాత్ర తెరవెనుక నుంచి బిజినెస్ ను నడిపిస్తుంటుంది. అయితే  ఆ పాత్రకు ఎదురు నిలిచి పుష్పను ఇబ్బంది పెట్టే ఓ పొలిటీషియన్ పాత్ర రెండో భాగంలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి ఆది పినిశెట్టి (Adi Pinisetty) అయితే బాగుంటుందని సుకుమార్ భావిస్తున్నాడట. ఇంకా మరికొంత మంది కూడా లిస్ట్ లో ఉన్నారట. త్వరలోనే ఆ పాత్రధారిని ఫైనల్ చేసి అధికారికంగా ప్రకటిస్తారట. మరి రెండో భాగంలోని ఆ కొత్త విలన్ ఎవరో చూడాలి. 

Updated Date - 2022-08-29T19:30:13+05:30 IST