Online Games: ఆన్‌లైన్‌ జూదం నేపథ్యంలో..

ABN , First Publish Date - 2022-12-09T15:27:37+05:30 IST

సాంకేతిక విప్లవం ప్రజలకు సౌకర్యంగా, సౌలభ్యంతో పాటు సమయాన్ని ఆదా చేస్తుంది. అదేసమయంలో ఎంతో ప్రమాదకరంగా కూడా మారింది..

Online Games: ఆన్‌లైన్‌ జూదం నేపథ్యంలో..

సాంకేతిక విప్లవం ప్రజలకు సౌకర్యంగా, సౌలభ్యంతో పాటు సమయాన్ని ఆదా చేస్తుంది. అదేసమయంలో ఎంతో ప్రమాదకరంగా కూడా మారింది. ఆన్‌లైన్‌ (Online) ద్వారా క్షణాల్లో నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. అన్ని పనులను కాలు బయటపెట్టకుండానే ఇంటి నుంచే పూర్తి చేసుకుంటున్నారు. అలాగే, ఆన్‌లైన్‌ జూదం ద్వారా క్షణాల్లో డబ్బు పోగొట్టుకుని కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.


ఈ తరుణంలో ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ నేపథ్యంలో ‘విళిత్తెళు’ (Vilittelu) పేరుతో ఒక చిత్రం రూపొందుతుంది. ఆదవన్‌ సినీ క్రియేషన్స్‌ బ్యానరుపై సీఎం దురై ఆనంద్‌ నిర్మిస్తున్నారు. శివగంగై మున్సిపల్‌ ఛైర్మెన్‌గా ఉన్న ఈయన జర్నలిస్టు కూడా. ఆన్‌లైన్‌ క్రీడలకు బానిసలై అన్ని విధాలుగా నష్టపోవడాన్ని నిశితంగా గమనించిన ఆయన యువతతో పాటు ప్రజలను మేలుకొలిపేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళ్‌ సెల్వన్‌ (Tamil Selvan) దర్శకుడు. మురుగ అశోక్‌, గాయత్రి రెమో జంటగా నటించే ఈ చిత్రంలో ‘పరుత్తివీరన్‌’ సుజాత, శరవణశక్తి, వినోదిని, రంజన్‌, మణిమారన్‌ తదితరులు ఇతర పాత్రలను పోషించారు.  



Updated Date - 2022-12-09T15:27:37+05:30 IST