విక్రాంత్‌ వీరోచిత విన్యాసం

ABN , First Publish Date - 2022-06-26T06:22:31+05:30 IST

కిచ్చా సుదీప్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘విక్రాంత్‌ రోణ’. అనూప్‌ భండారి దర్శకుడు. జాక్వలైన్‌ ఫెర్నాండేజ్‌, నిరూప్‌ భండారి, నీతా అశోక్‌ కీలక పాత్రలు పోషించారు...

విక్రాంత్‌ వీరోచిత విన్యాసం

కిచ్చా సుదీప్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘విక్రాంత్‌ రోణ’. అనూప్‌ భండారి దర్శకుడు. జాక్వలైన్‌ ఫెర్నాండేజ్‌, నిరూప్‌ భండారి, నీతా అశోక్‌ కీలక పాత్రలు పోషించారు. జాక్‌ మంజునాథ్‌ నిర్మాత. శనివారం హైదరాబాద్‌లో ‘విక్రాంత్‌ రోణ’ ట్రైలర్‌ని ఆవిష్కరించారు. రాంగోపాల్‌ వర్మ మాట్లాడుతూ ‘‘ఇది వరకు కన్నడ సినిమా అనగానే చిన్నచూపు ఉండేది. కానీ ‘కేజీఎఫ్‌’ లాంటి చిత్రాలు ఆ దృక్కోణాన్ని మార్చేశాయి. ‘విక్రాంత్‌ రోణ’ రషెష్‌ చూసి ఆశ్చర్యపోయా. సుదీప్‌ నటన, దర్శకుడు తెరకెక్కించిన విధానం చాలా కొత్తగా ఉన్నాయ’’న్నారు. సుదీప్‌ మాట్లాడుతూ ‘‘కొవిడ్‌ సమయంలో ఈ సినిమా షూటింగ్‌ చేశాం. నాగార్జున గారిని అడిగితే... అన్నపూర్ణ స్డూడియో మొత్తం మాకు ఇచ్చేశారు. రెండు నెలల పాటు, ఒక్క కొవిడ్‌ కేసు కూడా నమోదు కాకుండా చాలా జాగ్రత్తగా షూటింగ్‌ చేశాం. నా పాత్రని అద్భుతంగా మలచడానికి దర్శకుడు చాలా కష్టపడ్డారు. జులై 28న మా సినిమా విడుదల అవుతోంది. ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు.

Updated Date - 2022-06-26T06:22:31+05:30 IST