kiccha sudeep: నాగార్జున గేట్లు తెరిచారు!

ABN , First Publish Date - 2022-06-26T01:49:17+05:30 IST

కిచ్చా సుదీప్‌ (kiccha sudeep)టైటిల్‌ పాత్రలో నటించిన త్రీడీ చిత్రం ‘విక్రాంత్‌ రోణ’(Vikranth rona). జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అనూప్‌ భండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌, నిరూప్‌ బండారి, నీతా అశోక్‌ కీలక పాత్రలో నటించారు. సల్మాన్‌ ఖాన్‌ ఫిలింస్‌ సమర్పణలో జీ స్టూడియోస్‌, కిచ్చా క్రియేషన్స్‌ బ్యానర్‌పై జాక్‌ మంజునాథ్‌ నిర్మించారు. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.

kiccha sudeep: నాగార్జున గేట్లు తెరిచారు!

కిచ్చా సుదీప్‌ (kiccha sudeep)టైటిల్‌ పాత్రలో నటించిన త్రీడీ చిత్రం ‘విక్రాంత్‌ రోణ’(Vikranth rona). జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అనూప్‌ భండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌, నిరూప్‌ బండారి, నీతా అశోక్‌ కీలక పాత్రలో నటించారు. సల్మాన్‌ ఖాన్‌ ఫిలింస్‌ సమర్పణలో జీ స్టూడియోస్‌, కిచ్చా క్రియేషన్స్‌ బ్యానర్‌పై జాక్‌ మంజునాథ్‌ నిర్మించారు. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. రామ్‌ గోపాల్‌ వర్మ, అఖిల్‌ అక్కినేని, విజయేంద్ర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. (Vikranth rona on28 july)


కిచ్చా సుదీప్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కోసం అనూప్‌ నాలుగేళ్ల నుంచి నాతో జర్నీ చేస్తున్నాడు. నా పాత్రను గొప్పగా చూపించడానికి ఎంతో ఆలోచించాడు. సినిమా కోసం రాత్రింబవళ్లు కష్టడ్డాడు. కోవిడ్‌ తర్వాత ఈ సినిమా చేయాలని నాగార్జునగారిని అడిగితే మా కోసం గేట్స్‌ తెరిచారాయన. అన్నపూర్ణలో రెండున్నర నెలలకు పైగా షూటింగ్‌ చేశాం. జూలై 28న ఈ సినిమా కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. ప్రేక్షకులకు గొప్ప అనుభూతినిచ్చే చిత్రమిది’’ అని అన్నారు. (Vikranth rona)


దర్శకుడు అనూప్‌ భండారి  మాట్లాడుతూ ‘‘టాలీవుడ్‌లో నాకు అక్కినేని కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. నేను మొదటి పని చేసిన చిత్రం ‘గీతాంజలి’. విక్రాంత్‌ రోణ’ చిత్రాన్ని ఎక్కువశాతం అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్‌ చేశాం. నాగార్జునగారు కొన్ని సీన్స్‌ చూసి నన్ను పిలిచి ప్రత్యేకంగా అభినందించారు. రామ్‌గోపాల్‌వర్మ కూడా సినిమా చూసి సినిమాను చూసి ప్రశంసించటమే కాకుండా సపోర్ట్‌  చేస్తున్నారు’’ అని అన్నారు. (Vikranth rona Mocvie release)


ఆర్‌జీవీ మాట్లాడుతూ ‘‘ఒకప్పుడు కన్నడ ఇండస్ర్టీ అంటే ఏదో చిన్న పల్లెటూర్లో సినిమాలు తీస్తున్నారనే ఫీలింగ్‌ ఉండేది. ‘కేజీఎఫ్‌’తో తెలుగు పరిశ్రమకే కాకుండా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీకే ఓ బెంచ్‌ మార్క్‌ను క్రియేట్‌ చేస్తోంది. ‘కేజీఎఫ్‌ 2’ తర్వాత ‘విక్రాంత్‌ రోణ’ వస్తుంది. రష్‌ చూసి ఆశ్చర్యపోయా. స్టోరీ, సుదీప్‌ నటన,  అనూప్‌ తీసిన తీరు ఆకట్టుకున్నాయి. ట్రైలర్‌ చూశాక అనూప్‌ నుంచి ఇలాంటి డిఫరెంట్‌ సినిమా వస్తుందని ఊహించలేదు’’ అని అన్నారు. (Vikranth rona movie)


Updated Date - 2022-06-26T01:49:17+05:30 IST