Vikrant Rona తెలుగు థియేట్రికల్ రైట్స్ వారికే..

ABN , First Publish Date - 2022-06-28T14:44:53+05:30 IST

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా విక్రాంత్ రోణ (Vikrant Rona). ఈ మూవీ తెలుగు థియేటర్స్ రైట్స్ వరంగల్ శ్రీను (Warangal Sreenu) దక్కించుకున్నారు.

Vikrant Rona తెలుగు థియేట్రికల్ రైట్స్ వారికే..

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా విక్రాంత్ రోణ (Vikrant Rona). ఈ మూవీ తెలుగు థియేటర్స్ రైట్స్ వరంగల్ శ్రీను (Warangal Sreenu) దక్కించుకున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రస్తుతం చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్‌ నిర్వహిస్తు బిజీగా ఉంది. ఈ సినిమాకు అనూప్ భండారి (Anup Bhandari) దర్శకత్వం వహించారు. జూలై 28, 2022 న థియేటర్లలో భారీ విడుదలకు సిద్ధంగా ఉంది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి, అభిమానుల నుండి విశేష స్పందన వస్తోంది. 


సందీప్‌ కిషన్‌ (Sandeep Kishan)తో పాటు నీతా అశోక్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ (Jacqueline Fernandez), నిరూప్‌ బండారి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను జీ స్టూడియోస్‌, కిచ్చా క్రియేషన్స్‌ సమర్పణలో షాలిని ఆర్ట్స్‌ పతాకంపై నిర్మాతలు షాలిని, జాక్‌ మంజునాథ్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం జూలై 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీని త్రీడి ఫార్మెట్‌లో రూపొందించారు. ‘ఒక ఊరిలో ప్రజలు ఓ భయంకరమైన నిజం దాచాలనుకుంటారు. ఇంతకీ ఆ ఊరి కథ ఏంటి? ప్రజలు దాచాలనుకున్న ఆ నిజం ఏంటి? ఆ ఊరికి ఓ డెవిల్‌ వచ్చింది. ఆ డెవిల్‌ ఎవరు? భయం నిండిన ఆ ఊరికి భయమంటే ఎంటో తెలియని ఒకరు వచ్చారు. ఆయన ఎవరు? అనేదే ఈ చిత్ర కథ.  


ఈ పాత్రలోనే హీరో కిచ్చా సుదీప్ నటించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్‌ని వరంగల్ శ్రీను దక్కించుకున్నారు. తన కార్తికేయ గ్రూప్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాను వరంగల్ శ్రీను విడుదల చేయనున్నారు. ఆయన ఇప్పటికే నైజాం ఏరియాలో ఇస్మార్ట్ శంకర్, సుల్తాన్, క్రాక్, సీటీమార్, ఆచార్య వంటి భారీ చిత్రాలను పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పాన్ ఇండియా చిత్రం విక్రాంత్ రోణాను పంపిణీ చేయబోతున్నారు. 

Updated Date - 2022-06-28T14:44:53+05:30 IST