Vikramతో మేజర్ ఢీ..?

ABN , First Publish Date - 2022-06-02T18:33:03+05:30 IST

విశ్వనటుడు కమల్‌ హాసన్ (Kamal Haasan) నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ విక్రమ్ (Vikram) సినిమాతో బయోపిక్ ఆధారంగా అడివి శేష్ (Adivi Sesh) నటించిన మేజర్ (Major) ఢీ కొనబోతుంది.

Vikramతో మేజర్ ఢీ..?

విశ్వనటుడు కమల్‌ హాసన్ (Kamal Haasan) నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ విక్రమ్ (Vikram) సినిమాతో బయోపిక్ ఆధారంగా అడివి శేష్ (Adivi Sesh) నటించిన మేజర్ (Major) ఢీ కొనబోతుంది. ఈ రెండు సినిమాలు జూన్ 3వ తేదీన బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగబోతున్నాయి. దేశ వ్యాప్తంగా మేజర్‌ సినిమాను భారీగా విడుదల చేయబోతున్నారు. రియల్‌ హీరో మేజర్‌ సందీప్ కథ కావడంతో దేశ వ్యాప్తంగానూ అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. అయితే, ఈ సినిమాకు తమిళనాట మాత్రం కమల్‌ హాసన్‌ హీరోగా నటించిన విక్రమ్‌ మూవీతో గట్టిపోటీ తప్పకపోవచ్చు.. అని టాక్ వినిపిస్తోంది. వాస్తవంగా మేజర్ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినప్పటి నుంచే ఇటు సౌత్ అటు నార్త్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించడంలో మేకర్స్ టీమ్ సక్సెస్‌ అయింది. 


ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్‌ బాబు (Mahesh Babu) మరియు సోని పిక్చర్స్ వారు కలిసి దాదాపు మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన మేజర్‌ సినిమా కరోనా వల్ల చాలా ఆలస్యమవుతూ వచ్చింది. మహేష్ బాబు సంస్థలో మొదటిసారి బయటి హీరోతో చేస్తున్న సినిమా ఇదే. తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు బ్రాండ్‌ ఇమేజ్ కారణంగా భారీగానే ఓపెనింగ్స్ ఉండే అవకాశం ఉంది. యూఎస్‌లో అడివి శేష్‌కు ఉన్న ఇమేజ్ వల్ల కూడా మంచి వసూళ్లు నమోదవుతాయని చెప్పుకుంటున్నారు. ఉత్తరాదిన సందీప్ ఉన్ని కృష్ణన్‌కు ఉన్న క్రేజ్ కారణంగా భారీ ఓపెనింగ్స్ ఖాయం అంటున్నారు.


కానీ, తమిళనాట మాత్రం సినిమాకు కాస్త ఇబ్బందులు తప్పవట. దీనికి కారణం విక్రమ్‌ సినిమా అక్కడ 100 కోట్ల టార్గెట్‌తో రంగంలోకి దిగుతోంది. అద్బుతమైన సినిమా అంటూ కమల్‌ సన్నిహితులు మరియు విక్రమ్‌ యూనిట్‌ సభ్యులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి తమిళనాట ఈ సినిమాను బీట్‌ చేసి మేజర్ దూసుకుపోవాలంటే కాస్త కష్టమే అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. ఏదేమైన తమిళనాట విక్రమ్‌ టాక్‌ను బట్టే మేజర్ సక్సెస్ ఆధారపడి ఉంటుందనేది వాస్తవం. 

Updated Date - 2022-06-02T18:33:03+05:30 IST