Vikram : ఈ సారి బాలు లేకుండానే తెలుగు వెర్షన్

ABN , First Publish Date - 2022-05-18T15:15:52+05:30 IST

విశ్వనటుడు కమల్‌హాసన్ (Kamal hasan), టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh kanagaraj) కలయికలో వస్తున్న తమిళ థ్రిల్లర్ ‘విక్రమ్’ (Vikram). ‘ఖైదీ, మాస్టర్’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న లోకేష్ మూడో ప్రయత్నంగా కమల్‌తో ఓ ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టాడు.

Vikram : ఈ సారి బాలు లేకుండానే తెలుగు వెర్షన్

విశ్వనటుడు కమల్‌హాసన్ (Kamal hasan), టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh kanagaraj)  కలయికలో వస్తున్న తమిళ థ్రిల్లర్ ‘విక్రమ్’ (Vikram). ‘ఖైదీ, మాస్టర్’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న లోకేష్ మూడో ప్రయత్నంగా కమల్‌తో ఓ ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టాడు. మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay sethupathi), మాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్ (Fahad Fazil) కీలక పాత్రలు పోషిస్తుండగా.. నరేన్, అర్జున్ దాస్, హరీశ్ ఉత్తమన్, చంబన్ వినోద్ జోస్, ఆంటోనీ వర్గీస్, గాయత్రీ శంకర్, షాన్వీ శ్రీవాత్సవ, శివానీ నారాయణన్, రమేశ్ తిలక్, అరుళ్ దాస్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో చిత్రం ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు మేకర్స్. అందులో భాగంగానే ఈ సినిమా తమిళ వెర్షన్ ట్రైలర్ ను ఇటీవల విడుదల చేశారు. ట్రైలర్‌కు ఓ రేంజ్‌‌లో రెస్పాన్స్ వచ్చింది. 


అయితే ఇంతవరకూ తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదల కాకపోవడంతో అభిమానులు నిరాశచెందారు. అసలు ఈ సినిమాకి తెలుగు డబ్బింగ్ పూర్తయిందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకి తెలుగులో కమల్ హాసనే స్వయంగా డబ్బింగ్ చెప్పాలనుకుంటున్నట్టు టాక్. నిజానికి కమల్ నటించిన డైరెక్ట్ తెలుగు చిత్రాలకు ఆయనే డబ్బింగ్ చెప్పుకొనేవారు. డబ్బింగ్ వెర్షన్స్ కు మాత్రం యస్పీ బాలసుబ్రహ్మణ్యం (Sp Balasubrahmanyam) డబ్బింగ్ చెప్పేవారు. కమల్ స్పీడ్ ను, ఆ వాయిస్ ను బాలు మాత్రమే అందుకోగలరు. అందుకే కమల్ చిత్రాల తెలుగు వెర్షన్స్ కు బాలు ఆస్థాన డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యారు. అయితే యస్పీబాలు ఇప్పుడు లేకపోవడంతో.. ‘విక్రమ్’ సినిమా తెలుగు వెర్షన్ కు కమల్ హాసనే స్వయంగా డబ్బింగ్ చెప్పబోతున్నారు. కమల్ (Kamal) వాయిస్‌తో త్వరలోనే విక్రమ్ తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదల కాబోతోంది. 


అయితే బాలు (Balu) లేని లోటు విక్రమ్ తెలుగు వెర్షన్‌లో ఖచ్చితంగా కనిపిస్తుంది. కమల్ డైరెక్ట్‌గా తెలుగులో నటించి చాలా కాలమైపోయింది. అందుకే ఆయన వాయిస్ మనకు మళ్ళీ కొత్తగా అనిపించవచ్చు. ఏదేమైనప్పటికీ.. ఇన్నాళ్ళకు మళ్ళీ కమల్ ఒరిజినల్ వాయిస్ విక్రమ్ చిత్రంతో తెలుగువారు వినబోతున్నారన్నమాట. అదే రోజున తెలుగులో అడివి శేష్ ‘మేజర్’ (Major), అక్షయ్ కుమార్ నటించిన ‘పృధ్విరాజ్’ (Prithwiraj) చిత్రాలు విడుదల కాబోతున్నాయి. సో.. ఈ రెండు సినిమాలు ‘విక్రమ్’ చిత్రానికి గట్టి పోటీనివ్వబోతున్నాయి. 

Updated Date - 2022-05-18T15:15:52+05:30 IST