Vikram సీక్వెల్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా?

ABN , First Publish Date - 2022-06-05T13:47:09+05:30 IST

లోకనాయకుడు కమల్‌హాసన్ (Kamal Haasan), మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), మలయాళ విలక్షణ హీరో ఫహద్ ఫాజిల్(Fahad Fasil) తొలిసారిగా తెరపై కనిపించి అభిమానుల్ని అలరించిన చిత్రం ‘విక్రమ్’ (Vikram). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా థియేటర్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Vikram సీక్వెల్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా?

లోకనాయకుడు కమల్‌హాసన్ (Kamal Haasan), మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), మలయాళ విలక్షణ హీరో ఫహద్ ఫాజిల్(Fahad Fasil) తొలిసారిగా తెరపై కనిపించి  అభిమానుల్ని అలరించిన చిత్రం ‘విక్రమ్’ (Vikram).  లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా థియేటర్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. విడుదలైన రోజునుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో, కళ్ళు చెదిరే యాక్షన్ సీక్వెన్సెస్‌తో కమల్ ఒన్ మేన్ షో చేసిన ఈ సినిమాకి తెలుగుతో పాటు తమిళంలో అత్యధిక వసూళ్ళను రాబడుతోంది.  ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్‌లో సూర్య పాత్రతో హింటిచ్చాడు దర్శకుడు లోకేష్. ఈ నేపథ్యంలో ఈ క్రేజీ సీక్వెల్ పై అందరిలోనూ ఆసక్తినెలకొంది. 


అయితే ఈ సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేనప్పటికీ..  ప్రస్తుతం హీరో కమల్, దర్శకుడు లోకేష్ వేరు వేరు కమిట్ మెంట్స్ తో సినిమాలు చేయబోతున్నారు. ఫహద్ ఫాజిల్ తో గతేడాది ‘మాలిక్’ (Maalik) మలయాళ చిత్రాన్ని తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్న  టాలెంటెడ్ డైరెక్టర్ మహేశ్ నారాయణన్ (Mahesh Narayanan) దర్శకత్వంలో కమల్‌హాసన్ త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే. రజినీకాంత్ (Rajanikanth) హీరోగా లోకేష్ కనగరాజ్ ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ ఇద్దరి సినిమాలు పూర్తయినతర్వాత ‘విక్రమ్’ చిత్రానికి సీక్వెల్ ఉండబోతున్నట్టు వినికిడి. 


ఇక ‘విక్రమ్’ సీక్వెల్‌లో .. సూర్య (Surya) ని మెయిన్ విలన్‌గా నటించబోతున్నట్టు టాక్. మొదటి భాగంలో రోలెక్స్ అనే కరుడుగట్టిన మాఫియా లీడర్‌గా క్లైమాక్స్‌లో కనిపించి.. సినిమాకే హైలైట్ గా నిలిచాడు సూర్య. అలాగే.. ఫహద్ ఫాజిల్ చేసిన పాత్రను కూడా రెండో భాగంలో కంటిన్యూ చేయబోతున్నారు. కమల్.. విజయ్ సేతుపతిని చంపి.. కోడల్ని, మనవడ్ని అమెరికా పంపిన తర్వాత.. డ్రగ్స్ మాఫియాను పూర్తిగా తుడిచివేయడానికి మరో మిషన్ ను టేకప్ చేస్తాడని, ఆ ప్రయత్నంలో ఫహద్ ఫాజిల్ పాత్ర అతడికి సహాయపడడం రెండో భాగం కథాంశంగా తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2022-06-05T13:47:09+05:30 IST