నేను భారతీయుడిని.. మీరు ఏంటీ..? అని ప్రశ్నిస్తున్న Kamal Haasan.. సౌత్ వర్సెస్ నార్త్ డిబేట్‌పై సమాధానమిచ్చిన హీరో..

Twitter IconWatsapp IconFacebook Icon

బాలీవుడ్‌లో దక్షిణాది సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ‘బాహుబలి’ (Bahubali) ప్రాంచైజీతో మొదలైన కలెక్షన్ల పర్వం ఇంకా కొనసాగుతునే ఉంది. పాన్ ఇండియాగా రూపొందిన ‘కెజియఫ్’(KGF), ‘పుష్ప’(Pushpa), ‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR) బీ టౌన్‌లో భారీ స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఈ నేపథ్యంలో అన్ని ఇండస్ట్రీల వారు పలు భాషల్లో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. దీంతో సౌత్ వర్సెస్ నార్త్ అనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు స్పందించారు. తాజాగా విశ్వనటుడు కమల్ హాసన్(Kamal Haasan) ఈ అంశంపై మాట్లాడాడు.  


స్టార్ హీరో కమల్ హాసన్ తాజాగా నటించిన చిత్రం ‘విక్రమ్’ (Vikram). ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియాగా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న విడుదల కాబోతుంది. అందువల్ల చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా పాన్ ఇండియన్ సినిమాలపై తన అభిప్రాయాన్ని కమల్ హాసన్  వెలిబుచ్చాడు. ‘‘పాన్ ఇండియా సినిమాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. శాంతరామ్ గారు పాన్ ఇండియా సినిమాలు చేశారు. ‘పడోసన్’ పాన్ ఇండియా చిత్రం. మహ్మమద్ గారు ఆ సినిమా మొత్తం తమిళంలోనే మాట్లాడారు. ‘మొగల్-ఏ-ఆజం’ ను ఏమని పిలుస్తారు. అది నా దృష్టిలో పాన్ ఇండియన్ చిత్రం. అది కొత్తేం కాదు. అమెరికాతో పోల్చుకుంటే భారత్ వైవిధ్యభరితమైనది. మనం వేర్వేరు భాషలు మాట్లాడినప్పటికీ అందరు ఒకటే. భారత్ ప్రత్యేకత అదే. మనం ఎన్నో రోజుల నుంచి పాన్ ఇండియన్ చిత్రాలను రూపొందిస్తున్నాం. మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘చిమ్మేన్’ పాన్ ఇండియన్ మూవీయే. ఆ సినిమాను ఇతర భాషల్లోకి డబ్ కూడా చేయలేదు. సబ్ టైటిల్స్ కూడా వేయలేదు. అయినా సరే దానిని అందరు ఎంజాయ్ చేశారు’’ అని కమల్ హాసన్ తెలిపాడు.     


సౌత్, నార్త్ డిబేట్‌పై కూడా కమల్ స్పందించాడు.‘‘ నేను భారతీయుడిని. మీరు ఏంటీ..?  తాజ్ మహాల్ నాది. మధురై టెంపుల్ మీది. కశ్మీర్ ఎంత నాదో కన్యాకుమారి అంత మీది’’ అని కమల్ చెప్పాడు. విక్రమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. స్టార్ హీరో సూర్య అతిథి పాత్రలో మెరిశాడు. కాళిదాస్ జయరాం, నారాయణ్; ఆంటొనీ వర్గీస్, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.