Vikram ఫస్ట్ సింగిల్ ‘పతళ పతళ’.. దుమ్మురేపుతోంది

ABN , First Publish Date - 2022-05-14T03:03:44+05:30 IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan), సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‪లో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’ (Vikram). ఈ సినిమాకి

Vikram ఫస్ట్ సింగిల్ ‘పతళ పతళ’.. దుమ్మురేపుతోంది

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan), సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‪లో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’ (Vikram). ఈ సినిమాకి సంబంధించి మొదట విడుదలైన యాక్షన్ ప్యాక్డ్ టీజర్‌తోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‪గా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. తాజాగా చిత్ర ఫస్ట్ సింగిల్ ‘పతళ పతళ’ అంటూ సాగే లిరికల్ వీడియోని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‪లో దుమ్మురేపుతూ.. టాప్ ప్లేస్‪లో ట్రెండ్ అవుతోంది.


కోలీవుడ్ స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)  మాస్, బాస్ నెంబర్‪గా ఈ పాటని డిజైన్ చేశారు. అదిరిపోయే బీట్, మాస్ స్టెప్పులతో థియేటర్‌లలో ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ‘పతళ పతళ’ (Pathala Pathala) సాంగ్‪ని పిక్చరైజ్ చేసినట్లుగా ఈ లిరికల్ వీడియో చూస్తుంటే తెలుస్తుంది. ఈ పాటలో కమల్ హాసన్ తన మార్క్ డ్యాన్స్ మూవ్స్‌తో వింటేజ్ గ్రేస్‌ చూపించారు. కమల్ హాసన్ ఈ పాటకు సాహిత్యం అందించడంతో పాటు ఆయనే పాటని కూడా ఆలపించడం మరో ప్రత్యేకత. ప్రస్తుతం పాట సంచలనం సృష్టిస్తుండగానే.. మేకర్స్ చిత్ర ట్రైలర్, ఆడియో రిలీజ్ డేట్‪ని ప్రకటించారు. 


మే 16 చెన్నైలో ‘విక్రమ్’ థియేట్రికల్  ట్రైలర్, ఆడియోని గ్రాండ్‪గా విడుదల చేయబోతున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా, కమల్ హాసన్ హీరోగా నటించడమే కాకుండా.. తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (Raaj Kamal Films International) బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌(R Mahendran)తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విలన్‌గా నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.



Updated Date - 2022-05-14T03:03:44+05:30 IST