10 రోజుల్లోనే KGF 2 ని దాటేసిన Vikram Movie.. మొదటి స్థానంలో ఉన్న ఆ సినిమాను కూడా..

ABN , First Publish Date - 2022-06-13T17:19:14+05:30 IST

చాలా గ్యాప్ తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’. ‘ఖైదీ’, ‘మాస్టర్’ మూవీస్‌తో పాపులారీటీ సాధించిన లోకేశ్ కనగరాజ్...

10 రోజుల్లోనే KGF 2 ని దాటేసిన Vikram Movie.. మొదటి స్థానంలో ఉన్న ఆ సినిమాను కూడా..

చాలా గ్యాప్ తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’. ‘ఖైదీ’, ‘మాస్టర్’ మూవీస్‌తో పాపులారీటీ సాధించిన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. తమిళ స్టార్ హీరో సూర్య (Surya) అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు. జూన్ 3న తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.


బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న ఈ మూవీ 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల కలెక్షన్లని కొల్లగొట్టింది. ఈ మూవీ హిందీ వెర్షన్ దాదాపు రూ.6 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో తమిళనాడులో యశ్ హీరోగా నటించిన కె.జి.యఫ్ ఛాప్టర్ 2ని దాటేసి నెం.2గా నిలిచింది. అంతేకాకుండా అజిత్ కుమార్ వలిమై పక్క నెట్టేసి మొదటి స్థానం సాధించేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేష్ బాలా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.


కాగా.. చాలా ఏళ్ల తర్వాత సరైన విజయాన్ని రుచి చూసిన కమల్ హాసన్ ఉత్సహంగా ఉన్నారు. ఆయన సంతోషాన్ని పంచుకుంటూ మూవీ డైరెక్టర్ లోకేశ్‌కి 1.5 కోట్ల విలువ చేసే కారుని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అలాగే.. రోలెక్స్ పాత్రని కనిపించిన నటుడు సూర్యకి దాదాపు 10 లక్షల విలువ చేసే రోలెక్స్ వాచ్‌కి బహుమతిగా ఇచ్చాడు. అంతేకాకుండా.. ఈ సినిమాకి పనిచేసిన పలువరు అసిస్టెంట్ డైరెక్టర్స్‌కి, టెక్సిషియన్స్‌కి లక్షల విలువ చేసే బైకులు, బహుమతులు ఇచ్చారు.







Updated Date - 2022-06-13T17:19:14+05:30 IST