Vikram: నేను ఆరోగ్యంగా ఉన్నా... ఆ క్రియేషన్‌కి థ్యాంక్స్‌!

ABN , First Publish Date - 2022-07-12T22:28:32+05:30 IST

ఛాతీలో కాస్త ఇబ్బందిగా అనిపించడంతో మూడు రోజుల క్రితం చియాన్‌ విక్రమ్‌ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారంటు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్తల్ని ఆయన తనయుడు ధ్రువ్‌ ఖండించారు. తాజాగా విక్రమ్‌ కూడా ఈ విషయంపై మాట్లాడారు.

Vikram: నేను ఆరోగ్యంగా ఉన్నా... ఆ క్రియేషన్‌కి థ్యాంక్స్‌!

ఛాతీలో కాస్త ఇబ్బందిగా అనిపించడంతో మూడు రోజుల క్రితం చియాన్‌ విక్రమ్‌ (Vikram) చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారంటు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్తల్ని ఆయన తనయుడు ధ్రువ్‌ ఖండించారు. తాజాగా విక్రమ్‌ కూడా ఈ విషయంపై మాట్లాడారు. విక్రమ్‌ హీరోగా అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కోబ్రా’ (Cobra).  చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. చెన్నైలో నిర్వహించిన ఆడియో వేడుకలో విక్రమ్‌ పాల్గొన్నారు. వేదికపై ఉత్సాహంగా మాట్లాడారు. ‘నా ఆరోగ్యం గురించి వచ్చిన వార్తలన్నీ చూశా. ఆరోగ్యం బాగోని ఓ వ్యక్తి ఫొటోకు నా తలను పెట్టి మార్పింగ్‌ చేశారు. నా పేరుతో థంబ్‌ నెయిల్స్‌ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాల,, యూట్యూబ్‌ ఛానళ్లలో  వైరల్‌ చేశారు. వాళ్ల క్రియేటివిటీ చాలా బాగుంది. ఆ క్రియేషన్‌కి థ్యాంక్స్‌. కెరీర్‌ బిగినింగ్‌ నుంచి ఇలాంటివి ఎన్నో చూశా. నాకు ఇవేమీ కొత్త కాదు. పెద్దగా ఆందోళనకు గురిచేయలేదు. నా కుటుంబం, స్నేహితులు, అభిమానులు నాకు అండగా ఉన్నారు.  ఇంతకు మించి జీవితంలో నాకు ఏమీ అవసరం లేదు’. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా’ అని అన్నారు. (Vikram clarity on health)


‘కోబ్రా’ చిత్రంలో విక్రమ్‌ ఏడు విభిన్న గెటప్‌ల్లో కనిపించనున్నారు. ‘కేజీయఫ్‌’ ఫేం శ్రీనిధిశెట్టి కథానాయికగా నటిస్తోంది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంతోపాటు విక్రమ్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లోనూ నటిస్తున్నారు. (Ar rehman)


Updated Date - 2022-07-12T22:28:32+05:30 IST