Vikram Bhatt: మాజీ ప్రియురాలు సుస్మితా సేన్‌ రిలేషన్‌షిప్‌పై స్పందించిన డైరెక్టర్.. నా బ్యాంక్ బ్యాలెన్స్‌ని చెక్ చేసిందంటూ..

ABN , First Publish Date - 2022-07-19T17:43:34+05:30 IST

బాలీవుడ్ నటి సుస్మితా సేన్, లలిత్ మోదీ రిలేషన్‌షిప్ గురించి అందరికీ తెలిసిందే. వారి బంధం గురించి మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ ప్రకటించగానే..

Vikram Bhatt: మాజీ ప్రియురాలు సుస్మితా సేన్‌ రిలేషన్‌షిప్‌పై స్పందించిన డైరెక్టర్.. నా బ్యాంక్ బ్యాలెన్స్‌ని చెక్ చేసిందంటూ..

బాలీవుడ్ నటి సుస్మితా సేన్ (Sushmita Sen), లలిత్ మోదీ రిలేషన్‌షిప్ గురించి అందరికీ తెలిసిందే. వారి బంధం గురించి మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ ప్రకటించగానే ఎంతోమంది అభిమానులు, సెలబ్రిటీలు ఈ జంటకి సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్పారు. ఇది ఓ వైపు మాత్రమే.. మరోవైపు సుస్మితాపై విమర్శల వర్షం సైతం కురిసింది. డబ్బు కోసమే యువకుడైన రోహమాన్ షౌల్‌ని వదిలేసి, అంకులైన లలిత్‌ని పట్టుకుందని ట్రోల్ చేశారు. గోల్డ్ డిగ్గరంటూ కామెంట్స్ చేశారు.


ఈ విమర్శలపై సుస్మిత స్పందిస్తూ.. ‘నాకు పరిచయం లేనివారు, నేను ఎప్పుడు కలవని మిత్రులు నా జీవితంపై అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది మేధావులు ఫన్నీ గాసిప్స్‌ను ప్రచారం చేస్తున్నారు. నా చుట్టూ ఉన్న దయనీయ ప్రపంచాన్ని చూసి నాకు  చాలా బాధేసింది. నేనొక గోల్డ్ డిగ్గర్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి నాకు గోల్డ్ కన్నా డైమండ్స్ అంటే చాలా ఇష్టం. నేను వాటిని సొంతంగా కొనుక్కోగలను. ఇలాంటి ఇబ్బందికర సమయంలోను నాకు మద్దతుగా నిలిచిన శ్రేయోభిలాషులు, స్నేహితులకు ధన్యవాదాలు. మీ సుష్ (సుస్మిత) బాగానే ఉందని దయచేసి తెలుసుకోండి. మీ ఆమోదం, పొగడ్తల కోసం నా జీవితాన్ని గడపలేదు. ఇకపై అలా జరగదు’ అని పోస్ట్‌లో ఘాటుగా రాసుకొచ్చింది.


సుస్మితపై వచ్చిన విమర్శలపై నటి మాజీ ప్రియుడు, డైరెక్టర్ విక్రమ్ భట్ (Vikram Bhatt) సైతం తాజాగా స్పందించాడు. ఆయన ఈ సీనియర్ నటికి సపోర్టుగా మాట్లాడుతూ.. ‘నాతో ప్రేమలో పడేముందు సుస్మిత నా బ్యాంక్ బ్యాలెన్స్‌ని చెక్ చేసింది. అప్పుడు నేను ‘గులామ్‌’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాను. కానీ ఆ సమయంలో నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అయినా నన్ను ప్రేమించింది. నన్ను మొదట యూఎస్‌కి తీసుకెళ్లిన వ్యక్తి సుస్మితానే. నా ట్రిప్‌కు సంబంధించిన ఖర్చు మొత్తం ఆమె పెట్టుకుంది. మేము లాస్ ఏంజిల్స్ చేరుకునేటప్పటికి నాకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నా మొట్టమొదటి యూఎస్‌ని ఎంట్రీని చాలా స్పెషల్‌గా ప్లాన్ చేసింది. అందుకే సుస్మిత గోల్డ్ డిగ్గర్ కాదు. లవ్ డిగ్గర్.


ఇతరుల జీవితాన్ని ఎగతాళి చేయడం చాలామందికి వినోదంగా అనిపిస్తోంది. ఒకరి విషాదం మరొకరికి వినోదంగా ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్‌ని కరీనా కపూర్ (Kareena Kapoor) వివాహం చేసుకున్నప్పుడు.. ఆమెను కూడా ఇలాగే ట్రోల్ చేశారు. సెలబ్రిటీలు అంటేనే జనాలు అలా ప్రవర్తిస్తారు. సుస్మిత జీవితాన్ని ఒకసారి గమనించండి. తన ఇష్టప్రకారమే లైఫ్‌ని గడిపింది. ఆమె కావాలనుకుంటే టాప్ హీరోయిన్ అయ్యేది. కానీ పరిశ్రమలోని ఎటువంటి ప్రలోభాలకు లొంగలేదు. కెరీర్‌కి ఉపయోగపడతాడని ఏ హీరోతోనూ ఫ్రెండ్‌షిప్ చేయలేదు’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-07-19T17:43:34+05:30 IST