Vikram: పర్సనల్ స్టాఫ్ పెళ్లికి పంచెకట్టుతో హాజరయ్యి సందడి

ABN , First Publish Date - 2022-09-13T23:59:36+05:30 IST

ప్రతి సినిమాలో విభిన్న గెటప్పులతో ప్రేక్షకులను అలరించే నటుడు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). ‘అపరిచితుడు’, ‘ఐ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఒక్కో సినిమాలో వైవిధ్యభరితమైన

Vikram: పర్సనల్ స్టాఫ్ పెళ్లికి పంచెకట్టుతో హాజరయ్యి సందడి

ప్రతి సినిమాలో విభిన్న గెటప్పులతో ప్రేక్షకులను అలరించే నటుడు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). ‘అపరిచితుడు’, ‘ఐ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఒక్కో సినిమాలో వైవిధ్యభరితమైన నటనతో ఆడియన్స్‌ను మెప్పిస్తుంటాడు. విక్రమ్ తన వ్యక్తిగత సిబ్బందిని బాగా చూసుకుంటాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అందుకు బలం చేకూర్చే ఘటన తాజాగా చోటు చేసుకుంది. 


హీరో విక్రమ్ వద్ద ఒలిమారన్ (Olimaaran) అనే వ్యక్తి 40ఏళ్లు పనిచేశాడు. హౌస్ కీపింగ్ విభాగంలో సేవలు అందించాడు. తాజాగా ఒలిమారన్ కుమారుడు దీపక్ (Deepak) పెళ్లి వర్షిణి (Varshini) తో జరిగింది. ఈ వివాహానికి విక్రమ్ పంచెకట్టులో హాజరయ్యి సందడి చేశాడు. నూతన వధూవరులకు ఆశీర్వచనాలు అందించాడు. ఒలిమారన్ భార్య మేరీ (Mary)కూడా విక్రమ్ వద్ద పనిచేసింది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. విక్రమ్ చివరగా ‘కోబ్రా’ (Cobra) లో నటించాడు. శ్రీ నిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. ఆగస్టు 31న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. యావరేజ్‌గా నిలిచింది. మణిరత్నం హీస్టారికల్ డ్రామా ‘పోన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan) లో ఆదిత్య కరికాలన్ పాత్రను కూడా పోషిస్తున్నాడు. సెప్టెంబర్ 30న ఈ మూవీ విడుదల కానుంది. పా.రంజిత్‌తోను ఓ  ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.  

Updated Date - 2022-09-13T23:59:36+05:30 IST