Vikram 2: ఈ ఇద్దరిలో అసలు 'విక్రమ్' ఎవరు?

ABN , First Publish Date - 2022-06-09T15:38:41+05:30 IST

విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్' (Vikram). డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఈ సినిమాని తెరకెక్కించారు.

Vikram 2: ఈ ఇద్దరిలో అసలు 'విక్రమ్' ఎవరు?

విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్' (Vikram). డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఈ సినిమాని తెరకెక్కించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. వారం తిరగకముందే వరల్డ్ వైడ్‌గా 200 కోట్లు వసూళ్లని సాధించింది. 'విక్రమ్' సినిమాలో కమల్ హాసన్‌తో పాటుగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Setupathi) - మలయాళ విలక్షణ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahad Fasil) కీలక పాత్రలు పోషించారు. అద్భుతమైన కాస్టింగ్‌తో అల్టిమేట్ క్రూతో దర్శకుడు లోకేష్ సృష్టించిన ఈ మల్టీవర్స్ డార్క్ వరల్డ్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. 


ఇప్పుడు అన్ని చోట్లా విక్రమ్- రోలెక్స్ క్రేజ్ కనిపిస్తోంది. రోలెక్స్ పాత్రలో సూర్య డిఫరెంట్ లుక్‌లో అద్భుతంగా చేశాడు. అయితే, విక్రమ్ సీక్వెల్ సినిమాఫై ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj), రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా విక్రమ్ (Vikram) సినిమాకి లింక్ వుంటుందని టాక్. ఈ సినిమాలో కమల్ హాసన్ మనవడి పాత్రలో చరణ్ చేస్తాడని టాక్. లోకేష్‌తో రామ్ చరణ్ సినిమా ఉంది. మరో వర్గం ఫాన్స్ కమల్ మనవడి పాత్రలో దళపతి విజయ్ (Vijay) చేస్తాడని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే, ఇప్పుడు లోకేష్ కానగరాజ్.. దళపతి విజయ్ హీరోగా సినిమా చేస్తున్నాడు. కాబట్టి, విజయ్ మనవాడి పాత్ర చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 


ఒకవేళ విక్రమ్ సీక్వెల్‌లో విజయ్, రామ్ చరణ్‌లలో ఒకరు మనవాడి పాత్ర లో చేస్తే కమల్ హాసన్ అప్పటికి ఏ ఏజ్‌లో ఉంటాడు? విక్రమ్ సీక్వెల్  మనవాడి పాత్ర ఉంటె ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాడు..? ఈ ప్రశ్నలకి సమాధానం దొరకాలంటే డైరెక్టర్ లోకేష్ ఈ సినిమాఫై అప్డేట్ ఇచ్చేంతవరకూ వెయిట్ చేయాలి. రాగా, చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని చేస్తున్నారు. ఆ తర్వాత యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఇంకో సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాతే లోకేష్ - చరణ్ సినిమా పట్టాలెక్కవచ్చు.

Updated Date - 2022-06-09T15:38:41+05:30 IST