Maheshbabu విలన్‌గా విజయ్ సేతుపతి?

ABN , First Publish Date - 2022-06-05T16:09:21+05:30 IST

ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు ప్రముఖ నటులు విలన్‌గా మారడం‌ కొత్త ట్రెండ్. హీరోకి తగ్గ విలన్ ఉంటేనే అది అభిమానులకు, సగటు ప్రేక్షకులకు సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేసే అకాశం దక్కుతుంది. అందుకే టాలీవుడ్ లో ప్రస్తుతం ఈ ధోరణి ఎక్కువైంది. ఆల్రెడీ గోపీచంద్ మలినేని ఓ సీనియర్ హీరోతో తెరకెక్కించే యాక్షన్ చిత్రంలో కన్నడ హీరో దునియా విజయ్ విలన్‌గా ‌ నటిస్తున్నాడు.

Maheshbabu విలన్‌గా విజయ్ సేతుపతి?

ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు ప్రముఖ నటులు విలన్‌గా మారడం‌ కొత్త ట్రెండ్. హీరోకి తగ్గ విలన్ ఉంటేనే అది అభిమానులకు, సగటు ప్రేక్షకులకు సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేసే అకాశం దక్కుతుంది. అందుకే టాలీవుడ్ లో ప్రస్తుతం ఈ ధోరణి ఎక్కువైంది. ఆల్రెడీ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ఓ సీనియర్ హీరోతో తెరకెక్కించే యాక్షన్ చిత్రంలో కన్నడ హీరో దునియా విజయ్ (Duniya Vijay) విలన్‌గా ‌ నటిస్తున్నాడు. అంతకు ముందు అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప (Pushpa) లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ (Fahad Fasil) విలన్ గా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో‌ మరో భాషా నటుడు విలన్‌గా నటించనుండడం విశేషాన్ని సంతరించుకుంది. అతడు మరెవరో కాదు తమిళ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu). 


మహేశ్ బాబు 28వ చిత్రంగా త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా జూలైలో సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఇందులో పూజా హెగ్డే (Puja Hegde) కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘అతడు (Athadu), ఖలేజా (Khaleja)’ చిత్రాల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడో చిత్రం కావవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతిని ఎంపికి చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఆల్రోడీ విజయ్ సేతుపతి ‘ఉప్పెన’ (Uppena) లో విలన్ గా నటించి మెప్పించాడు. తమిళ దళపతి మాస్టర్ లోనూ, రీసెంట్ విడుదలైన కమల్ హాసన్ (Kamal Haasan) విక్రమ్ (Vikram) చిత్రంలోనూ అతడు విలన్ గా అదరగొట్టాడు. ఈ మూడు చిత్రాల్లోనూ అతడి టాలెంట్‌కు ముగ్ధుడైన త్రివిక్రమ్ విలన్ గా విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్టు సమాచారం. అతడు కూడా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వబోతున్నారు మేకర్స్. మహేశ్ బాబు, విజయ్ సేతుపతి పోరు వెండితెరపై ఎలా ఉండబోతుందని అభిమానులు ఇప్పటి నుంచే ఆసక్తిగా ఉన్నారు. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2022-06-05T16:09:21+05:30 IST