NTR30లో రాములమ్మ!.. అమిత్ షాను ఎన్టీఆర్ కలిశాక..?

ABN , First Publish Date - 2022-09-07T03:33:51+05:30 IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో ‘NTR30’ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లబోతున్న విషయం తెలిసిందే. కొరటాల ‘ఆచార్య’ (Acharya) షాక్‌ నుండి తేరుకోవడానికి కాస్త టైమ్ తీసుకోవడంతో

NTR30లో రాములమ్మ!.. అమిత్ షాను ఎన్టీఆర్ కలిశాక..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో ‘NTR30’ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లబోతున్న విషయం తెలిసిందే. కొరటాల ‘ఆచార్య’ (Acharya) షాక్‌ నుండి తేరుకోవడానికి కాస్త టైమ్ తీసుకోవడంతో ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూ వస్తోంది. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసిన కొరటాల.. నటీనటులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి (Vijayashanti) ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య బీజేపీ నేత అమిత్ షా (Amit Shah)-ఎన్టీఆర్ భేటీ తర్వాత ఇవి మరింత ఊపందుకున్నాయి. ఎందుకంటే, బీజేపీకి చెందిన విజయశాంతి.. అన్నీ కుదిరితే.. ఈ సినిమాలో నటించే అవకాశాలైతే లేకపోలేదు. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) సినిమా టైమ్‌లో.. ఇకపై నటించనంటూ రాములమ్మ (Ramulamma) ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇక ప్రజా సేవకే తన మనసును పూర్తి స్థాయిలో లగ్నం చేయబోతున్నట్లుగా ఆమె తెలిపారు. కాకపోతే.. తన పాత్ర హుందాగా ఉండి, కథ కూడా నచ్చితే మాత్రం.. అప్పుడు నటించాలా? వద్దా? అనేది ఆలోచిస్తానని ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర ఈవెంట్‌లో రాములమ్మ చెప్పుకొచ్చారు. 


అప్పుడామె ఆలోచిస్తాను.. అని అన్నారు కాబట్టి.. ఆమెను మెప్పించాలంటే బలమైన కథ ఉండాలి. తన పాత్ర హుందాగా ఉండాలి.. అప్పుడు విజయశాంతి ఓకే అనే అవకాశం ఉంది. అయితే.. బలమైన పాత్రలని సృష్టించడంలో కొరటాల శివ సమర్ధుడే. ఏదో ఒక్క సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన ఆయనని సాధారణ దర్శకుడు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అంతకు ముందు వరుస విజయాలతో.. ఇండస్ట్రీకి ఊర మాస్‌ని పరిచయం చేసిన సత్తా తనది. కాబట్టి, రాములమ్మ కోసం కచ్చితంగా మంచి పాత్రనే ఆయన క్రియేట్ చేసి ఉంటాడని అనుకోవచ్చు. అయితే అసలీ వార్తలో ఎంత నిజం ఉందనే విషయానికి వస్తే.. 


సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది ఆమెను రోజూ కలుస్తూనే ఉన్నారని.. ఇటీవల హీరో కళ్యాణ్ రామ్ (NTR30 సినిమాకి కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాత) కూడా విజయశాంతిని కలిసినట్లుగా తెలుస్తోంది. అలాగే,  ‘NTR30’ సినిమాకు సంబంధించిన కథని కూడా ఆమెకు చెప్పారని, కథ మొత్తం విన్న విజయశాంతి.. ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. రాములమ్మ నిర్ణయం చెప్పకుండానే.. ఈ సినిమాలో ఆమె నటిస్తున్నట్లుగా వార్తలు బయటికి వచ్చేశాయి. కానీ, అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతానికైతే ‘NTR30’ సినిమాలో నటించే విషయమై ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మాత్రం తెలుస్తోంది. తెలంగాణలో రాజకీయ చిత్రం రోజురోజుకీ మారుతున్న నేపధ్యంలో మళ్లీ ఆమె.. నటనవైపు అడుగేస్తుందా? అనేది డౌటే. కాకపోతే.. అమిత్ షా - ఎన్టీఆర్ సమావేశం తర్వాత.. విజయశాంతి మళ్లీ నటించే ఛాన్స్ అయితే లేకపోలేదు. చూద్దాం.. ముందు ముందు ఏం జరుగుతుందో?   

Updated Date - 2022-09-07T03:33:51+05:30 IST