యన్టీఆర్ చిత్రానికి విజయనగరం నేపథ్యం?

ABN , First Publish Date - 2022-01-28T16:47:58+05:30 IST

యంగ్ టైగర్ యన్టీఆర్ నటించిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. త్వరలో కొరటాల దర్శకత్వంలో 30వ చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు. తదుపరిగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బుచ్చిబాబు కథకి ఎంతో ఇంప్రెస్ అయిన తారక్.. చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తారక్ ఇమేజ్ కు అనుగుణంగా యాక్షన్, ఎమోషన్స్ కలగలిసిన అదిరిపోయే కథాంశాన్ని రెడీ చేస్తున్నాడట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనుందట.

యన్టీఆర్ చిత్రానికి విజయనగరం నేపథ్యం?

యంగ్ టైగర్ యన్టీఆర్ నటించిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. త్వరలో కొరటాల దర్శకత్వంలో 30వ చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు. తదుపరిగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బుచ్చిబాబు కథకి ఎంతో ఇంప్రెస్ అయిన తారక్.. చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తారక్ ఇమేజ్ కు అనుగుణంగా యాక్షన్, ఎమోషన్స్ కలగలిసిన అదిరిపోయే కథాంశాన్ని రెడీ చేస్తున్నాడట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనుందట. అయితే ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


విజయనగరం నేపథ్యంలో కథ నడుస్తుందని టాక్. ఆ ప్రాంతంలో వాస్తవంగా జరిగిన కొన్ని సంఘటనల్ని బేస్ చేసుకొని ఈ కథాంశాన్ని రాసుకున్నాడట దర్శకుడు బుచ్చిబాబు. సరిగ్గా ‘ఉప్పెన’ చిత్రాన్ని కూడా ఈ దర్శకుడు వాస్తవ సంఘటనల ఆధారంగానే మలిచిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుంది. మరి ఈ సినిమాలో యన్టీఆర్ మేకోవర్ పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో చూడాలి.

Updated Date - 2022-01-28T16:47:58+05:30 IST