Vijaya Shanti: ప్రజలకు లేని సమస్య వారికి ఎందుకు?

ABN , First Publish Date - 2022-04-29T20:48:52+05:30 IST

‘‘హిందీ భాష, హిందీయేతర భాష ప్రాధాన్యతపై ప్రస్తుతం కొనసాగుతున్న వాదవివాదాలు దురదృష్టకరం’’ అని సీనియర్‌ సినీ నటి విజయశాంతి అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘భిన్న సంస్కృతులు, విభిన్న ఆచార వ్యవహారాలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిస్తూ యావత్‌ ప్రపంచానికే ఆదర్శవంతమై ఉన్న మన దేశంలో నేడు హిందీ, హిందీయేతర భాషలకు సంబంధించి ఒకటి ఎక్కువ... మిగిలినవి తక్కువ అంటూ వివాదాలు సృష్టించే రీతిలో ఎవరు వ్యవహరించినా అది సరి కాదు.

Vijaya Shanti:  ప్రజలకు లేని సమస్య వారికి ఎందుకు?

ప్రపంచానికే ఆదర్శవంతమైన దేశం మనది..

ఒక్క భాష ఎక్కువ.. మరో భాష తక్కువ కాదు..

ఇందులో తగవులాడుకోవడానికి ఏముంది?

మాతృ భాషను అమ్మగా భావిద్దాం.. 

పరాయి భాషను మేలు చేసే మిత్రునిగా ఆదరిద్దాం

– సోషల్‌ మీడియాలో విజయశాంతి


‘‘హిందీ భాష, హిందీయేతర భాష ప్రాధాన్యతపై ప్రస్తుతం కొనసాగుతున్న వాదవివాదాలు దురదృష్టకరం’’ అని సీనియర్‌ సినీ నటి విజయశాంతి అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘భిన్న సంస్కృతులు, విభిన్న ఆచార వ్యవహారాలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిస్తూ యావత్‌ ప్రపంచానికే ఆదర్శవంతమై ఉన్న మన దేశంలో నేడు హిందీ, హిందీయేతర భాషలకు సంబంధించి ఒకటి ఎక్కువ... మిగిలినవి తక్కువ అంటూ వివాదాలు సృష్టించే రీతిలో ఎవరు వ్యవహరించినా అది సరి కాదు. ఈ విషయంలో ప్రజలకు లేని సమస్య నాయకులకు, నటులకు ఎందుకు ఉండాలి? సినిమా బాగుంటే అది హిందీ  భాషదైనా... ఇతర భాషదైనా ఆదరిస్తున్నారు. ఏ సినిమానైనా మరో భాషలోకి డబ్బింగ్‌ చేసి విడుదల చేయడమన్నది భాష సమస్య లేకుండా అవతలివారు కథని అర్థం చేసుకుని వినోదించడానికి తప్ప ఇందులో ఈ భాష ఎక్కువ... ఆ భాష తక్కువ అని తగవులాడుకోవడానికి ఏముంది? దక్షిణాది హీరోయిన్లు ఎందరో బాలీవుడ్‌లో టాప్‌ స్టార్స్‌గా నిలిచారు.  అలాగే ఉత్తరాది హీరోయిన్లు ఎందరినో దక్షిణాదివారు ఆదరిస్తున్నారు. ఇక్కడెక్కడా లేని సమస్య భాష విషయంలో ఎందుకుండాలి? ఇదెంతో బాధాకరం.  ఆ మాటకొేస్త ప్రపంచంలో ఎక్కువ మంది కమ్యూనికేట్‌ చేసే భాషగానూ, కొన్ని దేశాల్లో జాతీయ భాషగాను ఉన్న ఇంగ్లిష్‌ సినిమాలెన్నింటినో ప్రపంచంలోని ఇతర భాషల్లోకి అనువదిస్తున్నారు. ప్రజలు ఆ చిత్రాలను చూసి ఆనందిస్తున్నారు. మరి ఇంగ్లిష్‌ విషయంలో లేని సమస్యని మన దేశంలోని మన భాష విషయంలో ఎందుకు కొనితెచ్చుకుని వాదులాడుకోవాలి? ప్రపంచంలో కాని, మరే దేశంలోనైనా గాని ఎక్కువ మంది మాట్లాడే  ఒక భాషను కమ్యూనికేషన్‌ కోసం ఉపయోగించుకుంటే ఎక్కువ మందికి అర్థమవుతుందనే ఆలోచనే తప్ప ఆ ఒక్క భాషే ఎక్కువని... మిగిలినవి తక్కువని ఎవరు భావించినా తప్పే. నేడు మనవారెందరో చైనీస్‌, జాపనీస్‌, స్పానిష్‌, జర్మన్‌, ఫ్రెంచ్‌ లాంటి విదేశీ భాషలు నేర్చుకుంటున్నారు. మన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ విద్యార్థులెందరో తమ మాతృ భాషల్ని విస్మరించకుండా ఉద్యోగాలు, ఉపాధి కోసం ఎన్నో విదేశీ భాషల్ని సైతం నేర్చుకుంటున్నప్పుడు, దేశంలో ఎక్కువమంది మాట్లాడే హిందీని ఆదరించడాన్ని వ్యతిరేకించాల్సిన పనిలేదు. దక్షిణాదికి వచ్చి ఇక్కడి భాషలు నేర్చుకుని వ్యాపార వ్యవహారాలు నిర్వహించుకుంటున్న ఉత్తరాదివారు మనకి ఊరూరా కనిపిస్తారు. అలాగే ఉత్తరాదికి దక్షిణాదివారు వెళ్ళి, అక్కడి భాషలు నేర్చుకుని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. కోట్లాదిమంది సాధారణ ప్రజలకు లేని భాషా సమస్యను కొత్తగా సృష్టించవద్దు. మాతృ భాషను అమ్మగా భావిద్దాం.. పరాయి భాషను మనకు మేలు చేేసే మిత్రునిగా ఆదరిద్దాం’’ అని విజయశాంతి సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. 




Updated Date - 2022-04-29T20:48:52+05:30 IST