యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న విజయ్ సేతుపతి, సమంత రొమాంటిక్ సాంగ్..!

ABN , First Publish Date - 2022-04-21T22:47:55+05:30 IST

విలక్షణమైన పాత్రలు పోషిస్తూ ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు విజయ్ సేతుపతి. ‘సూపర్ డీలక్స్’, ‘96’, ‘విక్రమ్ వేద’ వంటి సినిమాలతో

యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న విజయ్ సేతుపతి, సమంత రొమాంటిక్ సాంగ్..!

విలక్షణమైన పాత్రలు పోషిస్తూ ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు విజయ్ సేతుపతి. ‘సూపర్ డీలక్స్’, ‘96’, ‘విక్రమ్ వేద’ వంటి సినిమాలతో అభిమానులను అలరించాడు. తాజాగా అతడు హీరోగా నటించిన చిత్రం ‘కాతు వక్కుల రెండు కాదల్’. ఈ మూవీ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కింది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించాడు. నయనతార, సమంత హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేస్తుంది. ఒక్కొక్కటిగా ఆడియో ట్రాక్‌లను విడుదల చేయడం మొదలుపెట్టింది. 


తాజాగా ఈ సినిమా నుంచి ‘డిప్పం, దప్పం’ అనే రెండో సాంగ్ విడుదల అయింది. విజయ్ సేతుపతి, సమంతల మధ్య రొమాంటిక్ సన్నివేశాలను ఈ గీతంలో చూపించారు. యూ ట్యూబ్‌లో ఈ పాట  విడుదల కాగానే 16గంటల్లోనే దాదాపుగా 26లక్షల మంది వీక్షించారు. ‘డిప్పం, దప్పం’ లిరిక్స్‌ను విఘ్నేశ్ శివన్ రాశాడు. అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందించాడు. ఈ పాట లిరిక్స్ తనకు ఎంతగానో సంతోషంగా నచ్చాయని సమంత చెప్పింది. ఈ సందర్భంగా విఘ్నేశ్ శివన్‌కు కృతజ్ఞతలు పేర్కొంది.  



Updated Date - 2022-04-21T22:47:55+05:30 IST