Shah Rukh Khan: షారూఖ్ ఖాన్ సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి..!

ABN , First Publish Date - 2022-08-04T00:34:27+05:30 IST

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా వైవిధ్య భరిత పాత్రలను పోషించే నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ‘విక్రమ్ వేద’, ‘సూపర్ డీలక్స్’, ‘విక్రమ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు.

Shah Rukh Khan: షారూఖ్ ఖాన్ సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి..!

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా వైవిధ్య భరిత పాత్రలను పోషించే నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ‘విక్రమ్ వేద’, ‘సూపర్ డీలక్స్’, ‘విక్రమ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. విజయ్ ఓ భారీ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటిస్తున్న భారీ చిత్రంలో అతడు అవకాశం కొట్టేసినట్టు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. 


షారూఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘జవాన్’ (Jawan). నయనతార (Nayanthara) హీరోయిన్‌గా నటిస్తుంది. స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ (Atlee Kumar) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో విలన్‌గా నటించే అవకాశాన్ని విజయ్ సేతుపతి దక్కించుకున్నట్టు బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘జవాన్’ షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ఆగస్టు చివరి వరకు అక్కడే చిత్రీకరణ  కొనసాగే అవకాశం ఉంది. ఈ షెడ్యూల్‌లోనే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో మొదటగా రానా దగ్గుబాటి విలన్‌గా నటించనున్నాడనే వార్తలు హల్‌‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘రానా దగ్గుబాటి ‘జవాన్’ నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ విజయ్ సేతుపతికి దక్కింది. షారూఖ్, అట్లీ విలన్ పాత్రకు మక్కల్ సెల్వన్ అయితేనే న్యాయం చేస్తాడని భావించారు. అందువల్ల షారూఖ్ స్వయంగా విజయ్‌ని సంప్రదించి ఆ పాత్ర చేయాలని కోరాడు. దీంతో అతడు నిరాకరించలేకపోయాడు. వరుస సినిమాలతో షూటింగ్ షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ డేట్స్ కేటాయిస్తానని మాటిచ్చాడు’’ అని చిత్ర బృందంతో సన్నిహితంగా మెలిగే వ్యక్తి చెప్పాడు. ఈ చిత్రాన్ని 2023 జూన్ 2న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. పాన్ ఇండియాగా ఈ సినిమా రూపొందింది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. షారూఖ్ సొంత నిర్మాణ సంస్థ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్’ ఈ చిత్రాన్ని నిర్మించింది. కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది. 

Updated Date - 2022-08-04T00:34:27+05:30 IST