cancellation: విజయ్‌ సేతుపతిపై కేసు రద్దు

ABN , First Publish Date - 2022-07-30T16:00:28+05:30 IST

cine actor vijay setupati case cancelled

cancellation: విజయ్‌ సేతుపతిపై కేసు రద్దు

అడయార్‌(చెన్నై), జూలై 29: నటుడు విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi)పై మహా గాంధీ అనే వ్యక్తి పెట్టిన కేసును మద్రాస్‌ హైకోర్టు(Madras High Court) రద్దు చేసింది. విజయ్‌ సేతుపతితో పాటు ఆయన మేనేజరు, మరికొంతమందిపై మహా గాంధీ  సైదాపేట మేజిస్ట్రేట్‌ కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు. గత యేడాది నవంబరు 2న బెంగళూరు విమానాశ్రయం(Bangalore Airport)లో తనను కించపరిచేలా మాట్లాడారంటూ ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ విజయ్‌ సేతుపతి మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు శుక్రవారం బెంగళూరులో జరిగిన సంఘటనకు సంబంధించిన ఆ కేసును రద్దు చేసింది.

Updated Date - 2022-07-30T16:00:28+05:30 IST