19(1)(a): విజయ్, నిత్య మూవీ టీజర్ విడుదల.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-20T15:51:36+05:30 IST

దేశవ్యాప్తంగా మంచి నటుల జాబితా తీస్తే విజయ్ సేతుపతి (Vijay Sethupathi), నిత్యా మీనన్ (Nithya Menen) పేర్లు కచ్చితంగా

19(1)(a): విజయ్, నిత్య మూవీ టీజర్ విడుదల.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే..

దేశవ్యాప్తంగా మంచి నటుల జాబితా తీస్తే విజయ్ సేతుపతి (Vijay Sethupathi), నిత్యా మీనన్ (Nithya Menen) పేర్లు కచ్చితంగా ఉంటాయి. ఈ యాక్టర్స్‌కి దక్షిణాదిలోని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలతోపాటు బాలీవుడ్‌లో కూడా మంచి పాపులారిటీ ఉంది. వీరిలో నిత్య ఇప్పటికే  బాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసింది. కాగా.. లోకేశ్ కనగరాజ్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘విక్రమ్’ సినిమాతో విజయ్ సేతుపతి హిందీలో పాపులారిటీ సాధించాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్స్ కలిసి తాజాగా ఓ మలయాళం సినిమా చేస్తున్నారు.


ఆ సినిమా పేరు 19(1)(a). ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానున్న ఈ సినిమాకి మలయాళీ లేడీ డైరెక్టర్ ఇందు దర్శకత్వం వహించింది. ఇందులో.. విజయ్ సేతుపతి రచయితగా, నిత్య టెలిఫోన్ బూతులో పనిచేసే అమ్మాయిగా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ (Teaser)ని తాజాగా మూవీ టీం విడుదల చేసింది. ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. దీంతో పలు ఫ్యాన్స్ ఈ మూవీపై స్పందిస్తూ ఈ నటులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఇద్దరూ సహజ నటులు నటిస్తే ఇలా ఉంటుంది’, ‘అంత స్టార్‌డమ్‌లో కూడా ఇలాంటి మలయాళం మూవీ చేస్తున్నందుకు ధన్యవాదాలు విజయ్ సర్’, ‘చాలా రోజుల తర్వాత నిత్యని చూడడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2022-07-20T15:51:36+05:30 IST