Vijay Deverakonda: కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-09-04T20:35:51+05:30 IST

టాలీవుడ్‌లో స్వ శక్తితో అంచెలంచెలుగా ఎదిగిన నటుడు విజయ్ దేవర‌కొండ (Vijay Deverakonda). తన యాసతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాలతో

Vijay Deverakonda: కీలక నిర్ణయం

టాలీవుడ్‌లో స్వ శక్తితో అంచెలంచెలుగా ఎదిగిన నటుడు విజయ్ దేవర‌కొండ (Vijay Deverakonda). తన యాసతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువయ్యాడు. విజయ్ తాజాగా నటించిన సినిమా ‘లైగర్’ (Liger). అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. పూరీ కనెక్ట్స్‌తో కలసి ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మించారు. దాదాపుగా రూ. 160కోట్ల భారీ బడ్జెట్‌తో మూవీని రూపొందించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న విడుదలైంది. ఫస్ట్ షో ఫస్ట్ డే షో నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. డిస్ట్రిబ్యూటర్స్‌కు భారీ నష్టం వాటిల్లింది. అందువల్ల నిర్మాతలు నష్టపోయినవారిని ఆదుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రొడ్యూసర్స్‌కు సహకరించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్‌లో కొంత భాగాన్ని తిరిగిచ్చేసినట్టు తెలుస్తోంది.


బాక్సాఫీస్ వద్ద ‘లైగర్’ ఘోరంగా పరాజయం పాలవడంతో విజయ్ దేవరకొండ రూ.6కోట్లను తిరిగిచ్చేశాడట. సినిమా నిర్మాత పూరీ జగన్నాథ్ త్వరలోనే డిస్ట్రిబ్యూటర్స్‌తో చర్చలు జరపనున్నట్టు సమాచారం. సినిమా ప్లాఫ్‌తో నష్టపోయిన మొత్తంలో కొంత భాగాన్ని భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. ‘లైగర్’ పాన్ ఇండియాగా రూపొందింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో మైక్ టైసన్, రమ్య కృష్ణ, విషు రెడ్డి, రోనిత్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

Updated Date - 2022-09-04T20:35:51+05:30 IST