లైగర్‌ సినిమాలో Vijay Deverakonda న్యూడ్ లుక్‌పై Samantha, Anushka రియాక్షన్ ఇదీ..!

ABN , First Publish Date - 2022-07-03T00:21:30+05:30 IST

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా నటిస్తున్న సినిమా ‘లైగర్’ ( Liger). పాన్ ఇండియాగా రూపొందుతోంది. స్పోర్ట్స్ డ్రామాగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్

లైగర్‌ సినిమాలో Vijay Deverakonda న్యూడ్ లుక్‌పై Samantha, Anushka రియాక్షన్ ఇదీ..!

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా నటిస్తున్న సినిమా ‘లైగర్’ ( Liger). పాన్ ఇండియాగా రూపొందుతోంది. స్పోర్ట్స్ డ్రామాగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్‌ (Karan johar) తో కలసి పూరీ జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది. అందులో భాగంగా సినిమా నుంచి కొత్త పోస్ట‌ర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్ న్యూడ్‌గా దర్శనమిచ్చాడు. అతడు ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. కామెంట్ కూడా చేశాడు. ‘‘ఈ సినిమా నా నుంచి అన్ని తీసుకుంది. శారీరకంగా, మానసికంగా, పాత్ర పరంగా ఇది నాకు ఛాలెంజింగ్ రోల్. నా శక్తినంతా ధారపోశాను. త్వరలోనే మీ ముందుకు వస్తున్నాను’’ అని విజయ్ దేవరకొండ తెలిపాడు. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి శుభాకాంక్షలు చెప్పారు.


లైగర్ పోస్టర్‌ను సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. ‘‘అతడికి రూల్స్ అన్ని తెలుసు. అందువల్ల అతడు మాత్రమే వాటిని బ్రేక్ చేయగలడు’’ అని సామ్ కామెంట్ చేసింది. అనుష్క శెట్టి (Anushka Shetty) కూడా ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ‘‘లైగర్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరి హృదయాన్ని ఈ సినిమా గెలుచుకుంటుందని ఆశిస్తున్నాను. పూరీ జగన్నాథ్ మ్యాజిక్‌ను తెర మీద చూడటానికి ఎదురుచూస్తున్నాను. ప్రతిసారి నువ్వు బెస్ట్‌ను అందిస్తున్నావు విజయ్. ఛార్మీ మరెన్నో కథలు చెప్పాలి. ప్రతి సారి లాగానే మంచి కథలో భాగమైనందుకు కరణ్‌కు థ్యాంక్ యూ’’ అని అనుష్క శెట్టి చెప్పింది.



Updated Date - 2022-07-03T00:21:30+05:30 IST