Vijay Deverakonda: బాబూ విజయ్ దేవరకొండ.. దీనర్థమేమి?

ABN , First Publish Date - 2022-09-13T02:37:09+05:30 IST

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) చేసిన ట్వీటొకటి ఇప్పుడు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ‘లైగర్’ (Liger) సినిమా పరాజయం తర్వాత విజయ్ దేవరకొండ పెద్దగా సోషల్ మీడియాలో

Vijay Deverakonda: బాబూ విజయ్ దేవరకొండ.. దీనర్థమేమి?

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) చేసిన ట్వీటొకటి ఇప్పుడు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ‘లైగర్’ (Liger) సినిమా పరాజయం తర్వాత విజయ్ దేవరకొండ పెద్దగా సోషల్ మీడియాలో రియాక్ట్ కాలేదు. ఆ సినిమా విడుదల తర్వాత మళ్లీ ఆయన.. రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebelstar Krishnam Raju)కు సంతాపం తెలిపేందుకే ట్వీట్ చేశారు. తాజాగా ‘సింగిల్ ప్లేయర్’ (Single Player) అంటూ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీటే అర్థం కాక నెటిజన్లు.. ‘దీనర్థమేమీ.. విజయ్ దేవరకొండా?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘సింగిల్ ప్లేయర్’ అంటూ ఆయన పోస్ట్ చేసిన పిక్‌లో చాలా స్టయిలీష్‌గా విజయ్ దేవరకొండ కనిపిస్తున్నారు. పిక్ వరకు నో ప్రాబ్లమ్.. కానీ ‘సింగిల్ ప్లేయర్’ అనే పదమే అనేకానేక అనుమానాలకు తావిస్తోంది. 


వాస్తవానికి ‘లైగర్’ సినిమాపై విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆ సినిమా ఖచ్చితంగా కొడుతుందని.. విడుదలకు ముందు అనేక ఈవెంట్స్‌లో చెప్పుకొచ్చాడు కూడా. ప్రమోషన్లలో అతని కాన్ఫిడెన్స్ చూసిన వారంతా.. మన సినిమా మరొకటి పాన్ ఇండియా వైడ్‌గా గట్టిగా మోగబోతుందని అనుకున్నారు. కానీ విడుదల తర్వాత ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తుస్సుమంది. దీంతో.. విడుదలకు ముందు విజయ్ మాట్లాడిన తీరుని అంతా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. విజయ్ కూడా ఆ సినిమా రిజల్ట్ ప్రస్తావన ఎక్కడా తీయకుండా.. శివ నిర్వాణ చేస్తున్న ‘ఖుషి’ (Kushi) సినిమా షూటింగ్‌ని పరుగులు పెట్టించే పనిలో ఉన్నాడు. 


అయితే ‘లైగర్’ టైమ్‌లోనే పూరీతో ప్రకటించిన ‘జనగణమన’ (Janaganamana) సినిమా గురించి మాత్రం విజయ్ ఇప్పుడెక్కడా మాట్లాడటం లేదు. ఆ సినిమా గురించి అడిగితే.. మాట మారుస్తున్నాడు తప్ప.. ఆ సినిమా గురించి మాట్లాడడానికి ఇష్టపడటం లేదంటే.. ‘జనగణమన’ దాదాపు ఆగిపోయినట్లే అని తెలిసిపోతుంది. ఇప్పుడు విజయ్ చేసిన ట్వీటే.. అందుకు సమాధానమని.. పూరి, ఛార్మీల నుండి బయటపడి.. ఇకపై తన ఆట తనే ఆడుకోవడానికి సిద్ధమయ్యానని చెప్పడానికే.. ఆయన అలా ట్వీట్ చేసి ఉంటాడని కూడా టాక్ నడుస్తుంది. ఏదిఏమైనా.. విజయ్‌కి మాత్రం ఇప్పుడో మంచి హిట్ కావాలి.. లేదంటే ముందు ముందు ఆయనకు సినిమా అవకాశాలు రావడం కూడా కష్టమే.. అనేలా ఆయన కెరీర్ మారిపోయే ప్రమాదం ఉందనేది ఇండస్ట్రీలో కూడా వినిపిస్తున్న మాట. (Vijay Deverakonda Tweet)



Updated Date - 2022-09-13T02:37:09+05:30 IST