Vijay Deverakonda: ‘లైగర్’ సీక్వెల్‌పై స్పందించిన విజయ్

ABN , First Publish Date - 2022-08-21T20:38:09+05:30 IST

సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి విజయ్ దేవర‌కొండ (Vijay Deverakonda). తన యాస, భాషతో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు. ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి

Vijay Deverakonda: ‘లైగర్’ సీక్వెల్‌పై స్పందించిన విజయ్

సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి విజయ్ దేవర‌కొండ (Vijay Deverakonda). తన యాస, భాషతో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు. ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి చిత్రాలతో అభిమానులను అలరించాడు. తాజాగా అతడు నటించిన సినిమా ‘లైగర్’ (Liger). అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. మైక్ టైసన్, రమ్య కృష్ణ, విషు రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విజయ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు.


‘లైగర్’ చిత్రానికీ సీక్వెల్ ఉండే అవకాశం ఉందని చెప్పాడు. ప్రస్తుతం అంతకు మించి వివరాలు వెల్లడించలేనన్నాడు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పూరీ జగన్నాథ్ కూడా సీక్వెల్‌కు సంబంధించిన హింట్ ఇచ్చాడు. కరణ్ జోహార్ మొదటగా ఈ విషయం గురించి ప్రస్తావించాడని చెప్పాడు. ‘లైగర్’ కు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా పాన్ ఇండియాగా రూపొందింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మొదట హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను తీసుకోవాలనుకున్నారు. కానీ, ఆమె డేట్స్ అందుబాటులో లేక పోవడంతో అనన్య పాండేను కథానాయికగా ఎంపిక చేశారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha)కు అనుకూలంగా మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో కొంత మంది నెటిజన్స్ ‘లైగర్’ ను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.   

Updated Date - 2022-08-21T20:38:09+05:30 IST