Vijay Deverakonda: తప్పుల నుంచి నేర్చుకోండి.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-09-20T19:58:51+05:30 IST

దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న అతి కొద్దిమంది నటుల్లో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు...

Vijay Deverakonda: తప్పుల నుంచి నేర్చుకోండి.. వీడియో వైరల్

దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న అతి కొద్దిమంది నటుల్లో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. ఈ యువ నటుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో నటించిన ‘పెళ్లి చూపులు’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ‘అర్జున్ రెడ్డి’తో ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయాడు. అనంతరం వచ్చిన ‘గీత గోవిందం’తో ఆ స్టార్ డమ్ మరింత పెరిగింది. అయితే అనంతరం చేసిన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 


ఈ తరుణంలోనే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌(Puri Jagannadh)తో కలిసి విజయ్ ‘లైగర్(Liger)’ అనే పాన్ ఇండియా సినిమా చేశాడు. విడుదలకి ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం విడుదల తర్వాత మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే.. విడుదలకి ముందు విజయ్ మాట్లాడిన మాటలు, చేతల వల్ల కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు. దాంతో విజయ్‌లో కొంచెం మార్పు వచ్చింది. ఈ తరుణంలో విజయ్ సోషల్ మీడియా(Social Media) వేదికగా ఓ వీడియోని షేర్ చేశాడు.


అందులో.. లైగర్‌లో తన పాత్ర కోసం విజయ్ థాయ్‌లాండ్‌లో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ క్లాసులు తీసుకున్నాడు. దానికి సంబంధించిన వీడియోని షేర్ చేశాడు. అందులో.. జంపింగ్ ఓవర్, బ్యాక్‌ఫ్లిప్స్, సైడ్ ఫ్లిప్‌లు, ఫాల్స్‌తో సహా పలు విన్యాసాలు చేశాడు. అలాగే.. లైగర్ సినిమాలోని ఫైట్‌ క్లిప్స్‌ని కూడా వాటికి యాడ్ చేశాడు. అంతేకాకుండా ఆ వీడియోకి.. ‘ఆండీ, అతని అనుచరుల దగ్గర స్టంట్స్ నేర్చుకున్నాను. కష్టపడి పని చేయండి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. కొత్త నైపుణ్యాలను పెంచుకోండి. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి. విజయాన్ని ఆస్వాదించండి. మీరు కోరుకున్న జీవితాన్ని గడపండి’ అంటూ రాసుకొచ్చాడు. చాలా ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది.


దీంతో పలువురు నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ విజయ్ చాలా హార్డ్ వర్కింగ్ అని, ఆయనకి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey) హీరోయిన్‌గా నటించగా.. రమ్యకృష్ణ, మైక్ టైసన్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని పూరీ, ఛార్మీతోపాటు కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించాడు.



Updated Date - 2022-09-20T19:58:51+05:30 IST