Vijay Deverakonda: శృంగారం చేసిన క్రేజీ ప్లేస్ ఏదంటూ కరణ్ అడిగితే.. విజయ్ నుంచి ఊహించని సమాధానం..!

ABN , First Publish Date - 2022-07-26T18:42:23+05:30 IST

ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లో స్టార్‌‌గా ఎదిగిన నటుడు విజయ్ దేవరకొండ. ‘లైఫ్ ఇజ్ బ్యూటీఫుల్’ సినిమాతో...

Vijay Deverakonda: శృంగారం చేసిన క్రేజీ ప్లేస్ ఏదంటూ కరణ్ అడిగితే.. విజయ్ నుంచి ఊహించని సమాధానం..!

ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లో స్టార్‌‌గా ఎదిగిన నటుడు విజయ్ దేవరకొండ. ‘లైఫ్ ఇజ్ బ్యూటీఫుల్’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఈ యువ నటుడు.. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా మారాడు. అనంతరం చేసిన ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టి క్రేజీ హీరోగా మారిపోయాడు. ఈ రౌడీ హీరో ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌ని జోరుగా నిర్వహిస్తోంది చిత్రబృందం. ఈ తరుణంలోనే పాపులర్ టాక్ ‘కాపీ విత్ కరణ్‌’కి అనన్యపాండేతో కలిసి విజయ్ అతిథిగా వెళ్లాడు.


బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో తాజాగా ఎపీసోడ్ ప్రోమోని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విడుదల చేసింది. షోకి అతిథులుగా వచ్చిన సెలబ్రిటీలను కరణ్ క్రేజీ ప్రశ్నలు అడుగుతుంటాడు. ఎప్పటిలాగే విజయ్‌ని, అనన్యని సైతం అలాంటి ప్రశ్నలే అడిగాడు కరణ్. అనన్య, ఆదిత్యారాయ్ కపూర్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీని గురించి కరణ్ మాట్లాడుతూ.. నీకు, ఆదిత్యారాయ్‌కి మధ్యలో ఏం జరుగుతోందని ప్రశ్నించాడు. అయితే.. సమాధానం చెప్పడానికి అనన్య సందేహించడం ప్రోమోలో కనిపిస్తుంది.


అలాగే కరణ్ బరితెగింపు ప్రశ్నల బారిన పడ్డాడు విజయ్.  లేటెస్ట్ గా నువ్వు సెక్స్ లో పాల్గొన్నది ఎప్పుడూ అని కరణ్ అడిగితే, విజయ్ దాటవేయాలని ఎబార్ట్ (abort) అంటే, అనన్య మాత్రం 'ఊహించి చెప్పనా, ఈ ఉదయం' అనేసింది. 'పబ్లిక్ ప్లేస్ లో శృంగారంలో పాల్గొన్నావా?' అనే ప్రశ్నకు కారులో చేశాననీ, తప్పని పరిస్థితులో అలా చేయాల్సి వచ్చిందనీ కన్నుగీటుతూ అన్నాడు విజయ్. 

ముగ్గురు పాల్గొనే (threesome) శృంగారం  గురించి కూడా కరణ్ అడిగితే లేదంటూ, అలా చేయడానికైతే ఏ ఇబ్బంది లేదని కూడా బదులివ్వడం ఆ ప్రోమోలో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



Updated Date - 2022-07-26T18:42:23+05:30 IST